HomeTelanganaNational

ప్రభాస్ న్యూస్…. అదంతా ఫేక్

ప్రభాస్ న్యూస్…. అదంతా ఫేక్

టాలీవుడ్ హీరో అయోధ్య రామ మందిరానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చాడనే వార్త చక్కర్లు కొడుతున్నది. అంతేకాక సంప్రోక్షణ రోజు ఆలయంలో ఆహార ఖర్చులన్నింటినీ తానే స్

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా గాంధీ
ఆలయంలోకి వెళ్ళకుండా రాహుల్ గాంధీని అడ్డుకున్న అధికారులు…రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపిన రాహుల్
నిన్న అయోద్యలో రెచ్చిపోయిన జేబు దొంగలు

టాలీవుడ్ హీరో అయోధ్య రామ మందిరానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చాడనే వార్త చక్కర్లు కొడుతున్నది. అంతేకాక సంప్రోక్షణ రోజు ఆలయంలో ఆహార ఖర్చులన్నింటినీ తానే స్పాన్సర్ చేయడానికి ఆయన ముందుకు వచ్చారనే వార్తలు కూడా వచ్చాయి.

ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఒక కార్యక్రమంలో అయొడ్య రామమందిరానికి ప్రభాస్ విరాళం ఇచ్చారని, దీక్షా కార్యక్రమానికి ఆహారం కోసం స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారని పేర్కొంటూ ఈ వార్తలకు మరింత‌ ఆజ్యం పోశారు.

“డబ్బు సంపాదించి ఇతరులతో పంచుకునే వాడు గొప్పవాడు. అలాంటి వారిలో ప్రభాస్ కూడా ఒకరు. విరాళం ఇస్తున్నాడు’’ అని ఆ ఎమ్మెల్యే ఓ కార్యక్రమంలో అన్నారు.

అయితే ఇండియా టుడేలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఇండియాటుడే బృందం ఈ అంశంపై ప్రభాస్ టీం ను సంప్రదించింది. ఇది ఫేక్ క్లెయిమ్ అని వారు కొట్టిపడేశారు. ప్రభాస్ అయోద్య రామందిరానికి విరాళంగా ఇవ్వలేదు. మందిర ప్రారంభోత్సవం రోజు ఆహారాన్ని స్పాన్సర్ చేస్తానని కూడా అతను చెప్పలేదు.