HomeTelanganaPolitics

మనం ఓడిపోతున్నామని మనమే ప్రచారం చేస్తే ఎట్లా ? నాయకులకు కేటీఆర్ క్లాస్…ఆడియో లీక్

మనం ఓడిపోతున్నామని మనమే ప్రచారం చేస్తే ఎట్లా ? నాయకులకు కేటీఆర్ క్లాస్…ఆడియో లీక్

ఇంకా 8 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూలంగా మ

తెలంగాణ లో హంగ్ వస్తే ఏం జరుగుతుంది ? ఎవరు అధికారంలోకి వస్తారు ?
కాంగ్రెస్ తో సీపీఎం క‌టీఫ్… ఒంటరిగా పోటీకి నిర్ణయం
ఎన్నికల్లో బీఆరెస్సే గెలుస్తుందని చెప్పేసిన బండి స‍ంజయ్

ఇంకా 8 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూలంగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుండటం బీఆరెస్ కు ఇరిటేట్ కలగజేస్తోంది. అందులోనూ పలువురు బీఆరెస్ నేతలు, కార్యకర్తలు కూడా ఈ ప్రచారాన్ని నమ్మి వాళ్ళు కూడా ఇదే విదమైన ప్రచారం చేస్తుండటం బీఆరెస్ అగ్రనేతలకు ఆగ్రహంన్ కలగజేస్తోంది.

ఈ నేపథ్యంలో ఇదే విషయంపై తాజాగ‌ బీఆరెస్ నాయకులతో మాట్లాడిన కేటీఆర్ ఫోన్ కాల్ ఆడియో లీక్ అయ్యింది. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేటీఆర్ గ్రూప్ ఫోన్ కాల్ ద్వారా సిరిసిల్లా నియోజకవర్గం నాయకులు, కార్యకర్త‌లతో మాట్లాడారు. అందులో ఆయన, తాము ఓడిపోతామని కాంగ్రెస్ వాళ్ళుకావాలనే గాలి వార్తలు ప్రచారం చేస్తున్నారని అది నమ్మి మీరు కూడా అదే ప్రచారం చేయడం సరైంది కాదని క్లాస్ పీకారు. ”సిరిసిల్ల పట్టణ కౌన్సిలర్లతో, అన్ని గ్రామాల సర్పంచులతో తాను మాట్లాడాను. ప్రతి ఒక్కరూ తమ దగ్గర మన పార్టీకి చాలా బాగుందని, పక్క వార్డులో, లేక పక్క గ్రామంలో పరిస్థితి బాగాలేదని తెలుస్తోందని చెప్పారు. అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని నమ్ముతున్నారు. ముందు మనం ఆ ప్రచారాన్ని నమ్మడం మానేయాలి.” అని కేటీఆర్ బీఆరెస్ నాయకులకు సూచించారు.

”ఫలానా కులం వాళ్ళు మొత్తం మహేందర్ రెడ్డికే సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారాన్ని మీరు పట్టించుకోకండి. ఓడిపోయేవాళ్ళు ఏదేదో ప్రచారం చేసుకుంటారు. ఆ మాటలను నమ్మడం మానేయండి.” అని కేటీఆర్ అన్నారు.

”నేను కూడా ఇంతకు ముందులాగా చేయను. వారంలో రెండు సార్లు తప్పకుండా సిరిసిల్లాకు వస్తా. రోజంతా ఉంటా. మీ సమస్యలు డైరెక్ట్ గా నాతోనే చెప్పుకోవచ్చు. గతంలో జరిగినవి మర్చిపోండి.”అన్నారు కేటీఆర్

”వాడెవడో పిచ్చోడు నేను ఓడిపోతున్నానని రాసిండు. అంత బేకూఫ్ గాళ్ళను, అంత హౌలగాళ్ళు అలా రాసే స్థాయికి పోయిందంటే మనలో మనమే అలా మాట్లాడుతున్నాము కాబట్టే అలా జరుగుతోంది.” అన్నాడు కేటీఆర్

ఈ వారంరోజులు జాగ్రత్తగా ప్ర్చారం చేయండి. ప్రతి ఇంటికి పోండి. వాళ్ళ్తో కూర్చొని కేటీఆర్ లేకపోతే ఎంత నష్టపోతరో వాళ్ళ్కు వివరించండి. మీరు కోపాలు, తాపాలు తగ్గించండి. కార్యకర్తలతో మంచిగా మాట్లాడండి. ఎవరన్నా ఒర్రినా మంచిగా, చిరునవ్వుతో మాట్లాడండి. ప్రజలెవరైనా లొల్లి పెడితే మీరు కూడా కయ్యిమనకండి అమ్మా గిన్ని పనులు జేసినం అని నచ్చజెప్పండి. మీరెవ్వరు కన్ ఫ్యూజ్ కాకుండ్రి. చెవులుకొరుకుడు బంద్ పెట్టున్రి. మంచిగా ప్రచారం చేయండి.” అని కేటీఆర్ ఫోన్ లో సిరిసిల్లా బీఆరెస్ నాయకులకు, కార్యకర్తలకు చెప్పారు.