HomeTelanganaPolitics

కాంగ్రెస్ తో సీపీఎం క‌టీఫ్… ఒంటరిగా పోటీకి నిర్ణయం

కాంగ్రెస్ తో సీపీఎం క‌టీఫ్… ఒంటరిగా పోటీకి నిర్ణయం

కాంగ్రెస్ పార్టీతో మార్క్సిస్టు పార్టీ తెగతెంపులు చేసుకుంది. తమకు రెండు సీట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక్క సీటు కూడా ఇవ్వనని చెప్పడం అవమానకరమని ఆ పా

తెలంగాణ లో హంగ్ వస్తే ఏం జరుగుతుంది ? ఎవరు అధికారంలోకి వస్తారు ?
కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?
బీజేపీకి విజయశాంతి రాజీనామా!

కాంగ్రెస్ పార్టీతో మార్క్సిస్టు పార్టీ తెగతెంపులు చేసుకుంది. తమకు రెండు సీట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక్క సీటు కూడా ఇవ్వనని చెప్పడం అవమానకరమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేను వీరభద్రం చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తు కుదరకపోవడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. తమకు తొలుత భద్రాచలం, పాలేరు, వైరా సీట్లు ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత మొదటి రెండు స్థానాలను పక్కన పెట్టి, వైరా, మిర్యాలగూడ ఇస్తామని చెప్పారని, అయినా తాము వెనక్కి తగ్గామన్నారు. తమకు రెండు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ వాటిని కూడా ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు.

మల్లు భట్టి విక్రమార్క తనకు ఫోన్ చేసి సాయంత్రం వరకు వేచి చూడాలని చెప్పారని, కానీ ఆ పార్టీ నుంచి స్పందన లేకపోగా.. సీట్లు ఇవ్వం.. ఎమ్మెల్సీలుగా చేస్తాం.. మంత్రులుగా చేస్తామని మాకు చెబుతున్నారని మండిపడ్డారు.

ఈ పరిస్థితుల్లో తమకు ఒంటరిగా వెళ్ళడం తప్ప మరో దారి లేదని తమ్మినేని అన్నారు. నకిరేకల్, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి, హుజూర్ నగర్, కోదాడ, జనగామ, భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, వైరా, సత్తుపల్లి, ఖమ్మం, మధిర, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. అవసరమైతే మరో మూడు నాలుగు సీట్లు కలుస్తాయని, ఇరవై సీట్లలో పోటీ చేసే అవకాశముందన్నారు. అయితే ఇప్పుడు తాము ప్రకటించిన జాబితాలో సీపీఐ పోటీ చేస్తే కనుక తాము ఉపసంహరించుకుంటామన్నారు.