HomeTelanganaPolitics

కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?

కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థులపై ఇన్ కం టాక్స్ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.వారం రోజుల క్రితం మహేశ్వరం నుండ

ఎన్నికల్లో బీఆరెస్సే గెలుస్తుందని చెప్పేసిన బండి స‍ంజయ్
బీజేపీకి బిగ్ షాక్:బీఆరెస్ లోకి దత్తత్రేయ‌ కూతురు?
ఎన్నికలకు ముందు పెరిగిన బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలు: అమెరికా సంస్థ రిపోర్ట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థులపై ఇన్ కం టాక్స్ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.
వారం రోజుల క్రితం మహేశ్వరం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కే. లక్షారెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ చైర్ పర్సన్ సీ. పారిజాతా నర్సింహరెడ్డి ఇళ్ళపై దాడులు చేసిన ఐటీ అధికారులు నిన్న‌ ఖమ్మం జిల్లాలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు ఇంటిపై, ఈ రోజు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాలు, ఇతర ఆస్తులపై దాడులు చేస్తున్నారు.

ఇంతకాలం లేనిది ఇప్పుడు ఎన్నికల ముందు సడెన్ గా కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు జరగడం, బీఆరెస్, బీజేపీ నేతలవైపు ఐటీ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి తమ నాయకులపై దాడులు నిర్వహించకపోవచ్చు కానీ తెలంగాణ తాము బీఆరెస్ పై తీవ్రంగా పోరాడుతున్నామని చెప్తున్న బీజేపీ నాయకులు బీఆరెస్ నాయకులని ఐటీ దాడుల నుంచి మినహాయించడాన్ని ఏ విధంగా సమర్దించుకుంటారు ? లేదంటే బీఆరెస్, బీజేపీ నాయకులందరికీ ఆదాయానికి మించిన ఆస్థులు లేవని ఐటీ శాఖ తేల్చేసిందా ?

ఇప్పటికే బీఆరెస్, బీజేపీలు బహిరంగంగా ఒకరిపై ఒకరు ఎన్ని విమర్శలు చేసుకున్నా అవన్నీ ప్రజలకు చూపించడం కోసం మాత్రమే అని, నిజానికి వారిద్దరి మధ్య రహస్య బంధం ఉందనే ప్రచారం ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉంది. పలువురు బీజేపీ కార్యకర్తలు, ఆ పార్టీలోంచి బైటికి వచ్చిన నాయకులే ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకుండా ఉండటం కోసం కేసీఆర్ మోడీతో ఒప్పందం చేసుకున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు కూడా.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ నేతలపైన మాత్రమె జరుగుతున్న ఈ ఐటీ దాడులను చూస్తూ ఉంటే ఆ రెండు పార్టీల రహస్య పొత్తుపై జరుగుతున్న ప్రచారంలో నిజముందేమో అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు, వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ నాయకుల వద్ద ఉన్నాయని , కానీ ఐటీ అధికారులు తన ఇంటిపై, కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై దాడులు చేయడం హేయమైనదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. తాను నామినేషన్ వేయకుండా కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపి౦చారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులను తీవ్రంగా ఖండించారు. ”నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ – కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం” అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.