HomeTelanganaPolitics

ఎన్నికల్లో బీఆరెస్సే గెలుస్తుందని చెప్పేసిన బండి స‍ంజయ్

ఎన్నికల్లో బీఆరెస్సే గెలుస్తుందని చెప్పేసిన బండి స‍ంజయ్

తెలంగాణ ఎన్నికల్లో తామె గెలిచి అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తూ ఉంటే ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంధ్ర కార్యదర్శి బండి సంజయ్ మాత్రం

బీఆరెస్ కు ఓటమి భయం పట్టుకుందా ? రంగంలోకి పీకేను దించిన కేసీఆర్ ?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రోజుకు 48 గంటలు కరెంట్ ఇస్తాడట!
తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారైనట్టేనా ?

తెలంగాణ ఎన్నికల్లో తామె గెలిచి అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తూ ఉంటే ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంధ్ర కార్యదర్శి బండి సంజయ్ మాత్రం కావాలనే చెప్పారో, పొరబాటున నోరు జారారో కానీ తాము గెలవడం లేదని, వచ్చే ప్రభుత్వం బీఆరెస్ దే అని తెల్చి చెప్పేశారు.

కరీంనగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో బండి సంజయ్ మాట్లాడుతూ, అసెంబ్లీలో కేసీఆర్ ను ప్రశ్నించాలంటే తాను అసెంబ్లీలో ఉండాలని, తనను అసెంబ్లీకి పంపితే కేసీఆర్ తో కొట్లాడుతానని, ప్రజలకు కావాలసిన డబుల్ బెడ్ రూం ఇళ్ళూ, పెన్షన్ తదితరాల కోసం అసెంబ్లీలో కేసీఆర్ తో కొట్లాడటానికి తానుండాలని అన్నారు.

అంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ అధికార పక్షంలో, తాము ప్రతిపక్షంలో ఉంటామని, అందుకే ముఖ్యమంత్రి కాబోయే కేసీఆర్ తో తాను పోరాడుతానంటున్నాడని, ఆయన మాటలు విన్నవాళ్ళు గుసగుసలాడుతుకున్నారు.

ఒకవైపు తాము అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు ఇప్పుడు బండి సంజయ్ మాటలకు ఏం జవాబు చెప్తారో చూడాలి.