HomeTelanganaPolitics

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారైనట్టేనా ?

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారైనట్టేనా ?

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేయడమే కాదు ఎన్ డీఏ లో కూడా ఉన్నారు. మరో వైపు చంద్రబాబుతో కూడా దోస్తానా చేస్తున్నాడు. బీజేపీ, టీడీపీలన

16 రోజులు… 54 సభలు… ప్రచార జోరు పెంచనున్న కేసీఆర్
బీఆరెస్ కు ఓటమి భయం పట్టుకుందా ? రంగంలోకి పీకేను దించిన కేసీఆర్ ?
కేటీఆర్ కు తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేయడమే కాదు ఎన్ డీఏ లో కూడా ఉన్నారు. మరో వైపు చంద్రబాబుతో కూడా దోస్తానా చేస్తున్నాడు. బీజేపీ, టీడీపీలను కలపడానికి తెగప్రయత్నం చేస్తున్నాడు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కూడా పోటీ చేస్తున్నట్టు జనసేన ప్రకటించింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో తెలంగాణలో చేతులు కలపడం వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్న బీజేపీ నాయకులు ఆయనతో పొత్తుకు తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్ంపీ లక్షణ్ లు పవన్ తో సమావేశం అయ్యి కలిసి ఎన్నికల్లో పోటీ చేద్దామన్న ప్రతిపాదన చేశారు.

ఇదే విషయంపై బీజేపీ కేంద్రనాయకత్వం తో చర్చలు జరిపిన కిషన్ రెడ్డి తెలంగాణలో పవన్ కళ్యాణ్ తో పొత్తు తమకు కలిసి వస్తుందని వారిని కన్విన్స్ చేసినట్టు సమాచారం. వీరిద్దరి పొత్తుకు అగ్రనేతలు కూడా సై అనడంతో ఇక సీట్ల పంపకంపై చర్చలు జరగాల్సి ఉంది.

జనసేన కు పది సీట్ల కన్నా ఎక్కువ ఇవ్వ కూడదని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ అంశంపై కిషన్ రెడ్డి ఇతర రాష్ట్ర నేతలు పవన్ తో చర్చలు జరపాలని భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో పొత్తు, సీట్ల పంపకం వంటి అంశాలన్ని క్లిఅయర్ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.