HomeNationalEditor's Choice

దేశభక్తి అంటే పక్క దేశాలను ద్వేషించడం కాదు – స్పష్టం చేసిన బోంబే హైకోర్టు

దేశభక్తి అంటే పక్క దేశాలను ద్వేషించడం కాదు – స్పష్టం చేసిన బోంబే హైకోర్టు

"నిజమైన దేశభక్తుడు నిస్వార్థపరుడు, తన దేశం కోసం అంకితభావంతో ఉంటాడు. అతను మంచి హృదయం ఉన్న వ్యక్తి అయితే తప్ప అలా ఉండ‌లేడు. మంచి హృదయం ఉన్న వ్యక్తి తన

ఇది ఎన్నో సారో ? కోమటి రెడ్డి మళ్ళీ అలిగారు!
హ‌త్యాచారాలు, నగ్న ఊరేగింపులు…ఒకటి కాదు వందలు జరిగాయని స్వయంగా అంగీకరించిన మణిపూర్ సీఎం
వచ్చేనెల 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం

“నిజమైన దేశభక్తుడు నిస్వార్థపరుడు, తన దేశం కోసం అంకితభావంతో ఉంటాడు. అతను మంచి హృదయం ఉన్న వ్యక్తి అయితే తప్ప అలా ఉండ‌లేడు. మంచి హృదయం ఉన్న వ్యక్తి తన దేశానికి ఇతర ఏ దేశం వారు వచ్చినా స్వాగతిస్తాడు. ఇది దేశంలో, సరిహద్దులో శాంతి, సామరస్యం, ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది, ”
“దేశభక్తుడిగా ఉండటానికి, విదేశాల నుండి, ముఖ్యంగా పొరుగు దేశం నుండి వచ్చిన వారితో శత్రుత్వం వహించాల్సిన అవసరం లేదని ఎవరైనా అర్థం చేసుకోవాలి” అని బాంబే హైకోర్టు పేర్కొంది.

లైవ్ మింట్ నివేదిక ప్రకారం, పాకిస్థానీ కళాకారులు భారతదేశంలో ప్రదర్శనలు ఇవ్వకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ పిటిషన్‌ను స్వయం ప్రకటిత సినీ కళాకారుడు ఫైజ్ అన్వర్ ఖురేషీ దాఖలు చేసినట్టు నివేదించబడింది. పాకిస్థాన్‌కు చెందిన కళాకారులతో ఎలాంటి వృత్తిపరమైన అనున్నైనా భారత ప్రభుత్వం నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. భారతీయ పౌరులు, కంపెనీలు పాకిస్థానీ సినీ కార్మికులు, సంగీతకారులు, గాయకులు, గీత రచయితలు, సాంకేతిక నిపుణులకు ఉపాధి కల్పించడం, పని ఇవ్వడం లేదా వారికి సహకరించడంపై నిషేధం విధించాలని పిటిషన్‌లో కోరారు.

సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఇటువంటి చర్య తిరోగమన దశ అని పేర్కొంటూ కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.

సంగీతం, క్రీడలు, సంస్కృతి , నృత్యం వంటి కార్యకలాపాలు జాతీయ , సాంస్కృతిక సరిహద్దులను అధిగమించాయని బెంచ్ నొక్కి చెప్పింది. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాల్గొంటున్న‌ అంశాన్ని కోర్టు హైలైట్ చేసింది. ప్రపంచ శాంతి, భద్రతను పెంపొందించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ప్రకారం, అలా అనుమతించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఇది ప్రశంసించింది.