HomeTelanganaPolitics

ఇది ఎన్నో సారో ? కోమటి రెడ్డి మళ్ళీ అలిగారు!

ఇది ఎన్నో సారో ? కోమటి రెడ్డి మళ్ళీ అలిగారు!

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పేరున్న, పట్టున్న నాయకుడు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఓ వెలుగు వెలిగిన నేత. ఆ తర్వాత కూడా నల్గ

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ ల యుద్దం
కాంగ్రెస్ కు షాక్: బీఆరెస్ లో చేరిన కీలక నేత
కాంగ్రెస్ కు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా… త్వరలోనే బీఆరెస్ లో చేరిక‌

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పేరున్న, పట్టున్న నాయకుడు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఓ వెలుగు వెలిగిన నేత. ఆ తర్వాత కూడా నల్గొండ‌ జిల్లాలో తన పట్టు నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారు. బీఆరెస్ గాలి బలంగా వీస్తున్న సమయంలో కూడా భువనగిరి పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిచారు.

అయితే ఉత్తమ్ అకుమార్ రెడ్డి తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి తనకే వస్తుందని ఆశపడి, అది రేవంత్ రెడ్డిని వరించడంతో భంగపడి, అవమానంగా భావించి, ఆగ్రహంతో అలిగాడు. చాలా కాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు. పార్టీ అగ్రనాయకత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ కు వ్యతిరేకంగా అనేక బహిరంగ వ్యాఖ్యలే చేశాడు. రేవంత్ పై అయితే దుందుడుకు వ్యాఖ్యలు కూడా చేశారు. అదె సమయంలో ఆయన తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరడం, మునుగోడులో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఉపఎన్నికల్లో పోటీ చేయడం అందరికీ తెలిసిందే ఆ సమయంలో వెంకట్రెడ్డి పాత్ర చాలా వివాదాస్పదమయ్యింది. మునుగోడు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫోన్లు చేసి తన తమ్ముడికి మద్దత్రు తెలపాల్సిందిగా ప్రచారం చేశాడన్న ఆరోపణలున్నాయి. అయినప్పటికీ అక్కడ రాజగోపాల్ రెడ్డి ఓడిపోయి బీఆరెస్ గెలిచింది.

ఆ తర్వాత కూడా చాలా కాలం వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉ‍ంటూ వచ్చారు. గాంధీ భవన్ కడప తొక్కనని శపథం కూడా చేశారు. ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ పెద్దలు కలగజేసుకొని రేవంత్ ను, వెంకట్ రెడ్డిని కలపడానికి ప్రయత్నించగా అందరి ముందూ బాగున్నట్టే ప్రవర్తించి మళ్ళీ విమర్శలు మొదలు పెట్టారు. ఈ విధంగా కొద్ది రోజులు అలగడం, కొద్ది రోజులు బాగుండటంగా సాగుతున్న క్రమంలో కర్నాటక ఎన్నికల ఫలితాలు పరిస్థితిని మార్చేశాయి. అందరు నాయకులు ఐక్యంగా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం కష్టం కాదని అధిష్టానం వెంకట్ రెడ్డికి, రేవంత్ కు నచ్చజెప్పింది.

ఆ తర్వాత ఇద్దరూ తమ విబాధాలు మర్చిపోయి కలిసికట్టుగా పని చేయడం మొదలు పెట్టారు. ఇద్దరు కలిసి అనేక సమావేశాల్లో ఆనందంగా కబుర్లు చెప్పుకున్న దృశ్యాలు కనిపించాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికి వస్తున్న సమయంలో ఇలా కాంగ్రెస్ నాయకులంతా ఒక్కటిగా నిలబడటంతో కార్యకర్తలు కూడా తెగ సంతోషించారు.

అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితి మొదటి కొచ్చింది. కోమటి రెడ్డి వెంకట రెడ్డి మళ్ళీ అలిగారు. అయితే ఈ సారి రేవంత్ మీద కాదు. అధిష్టానం మీదే ఆయన గుస్సాగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్య్న్నత కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తనకు చోటు దక్కుతుందని భావించిన ఆయనకు అధిష్టానం మొండి చేయి చూపడం, అదే సమయంలో మాజీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ‘కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ’ మెంబర్ గా నియమించడం వెంకట రెడ్డిని పక్కనపెట్టడంతో కోమటి రెడ్డి వెంకట రెడ్డి మండిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్ట్ ను ఫైనల్ చేసి అధిష్టానానికి పంపడానికి ఈ రోజు తాజ్ క్రిష్ణాలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీకి కూడా హాజరు కాకుండా తన అసమ్మతిని తెలియజేశారు.

అన్నింటికన్నా తనకు పార్టీయే ముఖ్యమంటూ నిన్నటి దాకా చెప్తూ వచ్చిన కోమటి రెడ్డి ప్రస్తుతం తనకు తన ఆత్మగౌరవమే ముఖ్యమని చెప్తూ అలిగి కూర్చున్నారు.

మరో వైపు కోమటి రెడ్డిని బుజ్జగించడానికి ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాకూర్ కోమటి రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన తో సమావేశమయ్యారు. అక్కడి నుంచే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఫోన్ లో మాట్లాడించారు. ఈ రోజు హైదరాబాద్ లో తనను కలవాలని వేణుగోపాల్ వెంకట్ రెడ్డికి సూచించినట్టు సమాచారం.

మరి వెంకట్ రెడ్డి అలక వీడి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారా ? లేదా బెట్టు వీడక దూరంగా ఉంటారా ? అనేది వేచి చూడాలి.