HomeTelanganaPolitics

అన్ని వర్గాల ప్రజల మేలు కోసం కొట్లాడే ఫైటర్ బండి సంజయ్: బొంతల కళ్యాణ్

అన్ని వర్గాల ప్రజల మేలు కోసం కొట్లాడే ఫైటర్ బండి సంజయ్: బొంతల కళ్యాణ్

ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్ని వర్గాల ప్రజల మేలు కోసం కొట్లాడే ఫైటర్… *దీక్షలను రాజకీయాలకు వాడుకున్న చరిత్ర బి ఆర్ ఎస్ దే … *ప్రజలు కర్రు కాల్చి

బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా – ఎల్లుండి కాంగ్రెస్ లో చేరిక‌
మోడీ ఉపన్యాసంపై మండిపడ్డ బీజేపీ సీనియర్ నేత
కుకీ, కేంద్రం శాంతి ఒప్పందానికి డేట్ ఫిక్స్ కాగానే మణిపూర్ లో హింస రేగడానికి కారణమెవరు ?

ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్ని వర్గాల ప్రజల మేలు కోసం కొట్లాడే ఫైటర్…

*దీక్షలను రాజకీయాలకు వాడుకున్న చరిత్ర బి ఆర్ ఎస్ దే …

*ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన బిఆర్ఎస్ నేతల బుద్ధి మారడం లేదు..

*నాడు మేయర్ గా చేసిన రవీందర్ సింగ్ కరీంనగర్ ను ఏం ఉద్ధరించారు…?

*బిఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ .. ఆ పార్టీ గెలుస్తుందని రవీందర్ సింగ్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం..

*భవిష్యత్తులో గల్లీలో .. ఢిల్లీలో .. బిఆర్ఎస్ ఉండదనే భావనతో ఆ పార్టీ క్యాడర్ ఇతర పార్టీలకు వలస పోతున్నారు..

*బి ఆర్ ఎస్ కు ఓటు వేస్తే వృధా అనే భావన ప్రజల్లో ఉంది..

*కాంగ్రెస్ ప్రభుత్వ రైతు భరోసా హామీ.. 2లక్షలరైతు రుణమాఫీ ఏమైంది..?

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ బొంతల కళ్యాణ్ చంద్ర వ్యాఖ్యలు…

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్ని వర్గాల మేలు కోసం కొట్లాడే ఫైటర్ అని, దొంగ దీక్షలు , రాజకీయ అవసరాల కోసం దీక్షలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ కు ఉంది కాబట్టే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, అయినా కూడా బి ఆర్ ఎస్ నేతల బుద్ధి మారడం లేదని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ బొంతల కళ్యాణ్ చంద్ర విమర్శించారు. బుధవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ మేయర్ గా పనిచేసిన రవీందర్ సింగ్ ముందు కరీంనగర్ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో.. నాడు మేయర్ గా ఉంది ఏమి ఉద్ధరించారో చెప్తే బాగుంటుందన్నారు. పట్టణ ప్రజలకు మంచి నీటి అవసరాలు కోసం ఎంపీ బండి సంజయ్ ఏనాడూ మాట్లాడలేదని రవీందర్ సింగ్ వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుపడాలన్నారు. మేయర్ గా పనిచేసి, అధికారం లో ఉండి రవీందర్ సింగ్ కనీసం పట్టణ ప్రజలకు మంచినీళ్లు కూడా ఇప్పించలేకపోయారని ఆయన మాటలలే స్పష్టం చేస్తున్నాయన్నారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని రవీందర్ సింగ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీగా మారిందని, ఆ పార్టీలోనే నాయకులంతా ఇతర పార్టీలోకి వలస పోతున్నారని, రోజు రోజుకి బిఆర్ఎస్ ఖాళీ అవుతుందని, గల్లీలో, ఢిల్లీలో ఉండని పార్టీకి ఓటుకు ఎందుకు వేయాలనే భావన ప్రజల్లో ఉందని, బి ఆర్ ఎస్ కు ఓటు వేస్తే వృధా అనే పరిస్థితి ఉందన్నారు. బిఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్న సమయంలో ప్రజల కోసం పనిచేయకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేశారని, అలాంటి నాయకులకు ఎంపీ బండి సంజయ్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ గతంలోరాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో రైతులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారందరి మేలు కోసం కొట్లాడిన చరిత్ర బండి సంజయ్ కి ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వేలకోట్ల అభివృద్ధి పనులు బండి సంజయ్ కుమార్ చేయించారన్నారు . కొంతమంది రైతు ఉద్యమ ముసుగులో చేస్తున్న రాజకీయాల ఏంటో దేశ ప్రజలందరికీ అర్థమైందన్నారు. రైతుల మేలు కోసం తీసుకువచ్చిన రైతు చట్టాలు ను స్వాగతించకుండా , అనవసర రాద్ధాంతం చేసి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని వెనక్కి తీసుకున్నందుకు అనవసర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. అలాగే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో రైతులకు ఇచ్చిన గ్యారంటీ లను ఎందుకు విస్మరించిందో స్పష్టం చేయాలన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు 15000, కౌలు రైతులకు 12000 పెట్టుబడి సాయం, రెండు లక్షల రుణమాఫీ నీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. సాగునీలు లేక పంటను కాపాడుకోవడానికి అన్నదాతలు అరగోస పడుతున్నారని, తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతుల పట్ల కనికరం లేకుండా ఉందని, ఇచ్చిన హామీలను కూడా నిలుపుకోలేక రైతులను మోసం చేస్తుందన్నారు.