HomeTelanganaPolitics

బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా – ఎల్లుండి కాంగ్రెస్ లో చేరిక‌

బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా – ఎల్లుండి కాంగ్రెస్ లో చేరిక‌

కొంతకాలంగా జరుగుతున్న ప్రచారమే నిజమయ్యింది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన ఎల్లుండి ఢిల్లీలో సోనియా, రాహుల్ సమక్షంలో కాం

‘బీజేపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా’
అమిత్ షా ఒత్తిడితో చివరకు కాసినో కింగ్ చీకోటిని బీజేపీలో చేర్చుకున్నారు
దోస్త్….కటిఫ్…దోస్త్…కటీఫ్…మల్ల ఇవ్వాళ్ళ దోస్తానా!

కొంతకాలంగా జరుగుతున్న ప్రచారమే నిజమయ్యింది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన ఎల్లుండి ఢిల్లీలో సోనియా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.

కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆయన బీజేపీకి అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. పైగా ఆయన ఎల్బీ నగర్ టికట్, ఆయన భార్యకోసం మునుగోడు టికట్ కావాలని బీజేపీ నాయకత్వాన్ని అడిగారు. కానీ ఆ పార్టీ ఆయన డిమాండ్ ను అంగీకరించలేదు. పైగా తొలి లిస్ట్ లో ఆయన పేరు కూడా లేకపోవడంతో రగిలిపోతున్న రాజగోపాల్ రెడ్డికిని కాంగ్రెస్ నాయకులు టచ్ లోకి వెళ్ళారు. వారితో చర్చల తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తూ ప్రకటన విడుదల చేశారు. బీఆరెస్ ను ఓడించడమే లక్ష్యంగా తాను బీజేపీలో చేరానని అయితే అందుకు అణుగుణంగా బీజేపీ ఎదగలేకపోయిందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ మాత్రమే బీఆరెస్ ను ఓడించగలదని, ప్రజల్లో కూడా కాంగ్రెస్ పై నమ్మకం పెరిగిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ”సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల కేసీఆర్ సర్కారు అరాచక పాలనతో గాడి తప్పింది. అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నేను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నాను.” అని ఆయన తెలిపారు.