HomePoliticsNational

వచ్చేనెల 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం

వచ్చేనెల 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఓప్రకటన చేశ

కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడు -బండి సంజయ్ సంచలన ఆరోపణ‌
రాహుల్ రావణుడు, మోడీ దానవుడు…. కాంగ్రెస్, బీజేపీల పోస్టర్ వార్
తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు… ప్రకటించిన ప్రధాని మోడీ

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఓప్రకటన చేశారు.

”పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు (17వ లోక్‌సభ 13వ సెషన్‌, రాజ్యసభ 261వ సెషన్‌) సెప్టెంబర్‌ 18 నుంచి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అమృత్‌కాల్‌ సమయంలో జరిగే ఈ సమావేశంలో పార్లమెంట్‌లో అర్థవంతమైన చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను.” అని ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు.

ఈ సమావేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ One Nation, One Electionపై బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఎప్పటి నుంచో జమిలి ఎన్నికలు జరపాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీ BJP ఎట్టకేలకు అందుకోసం హటాత్తుగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించబూనుకుందని చర్చజరుగుతోంది.
ఈ బిల్లుతో పాటు యూనిఫామ్ సివిల్ కోడ్ Uniform Civil Code, మహిళా రిజర్వేషన్ women’s reservation బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

కొత్త పార్లమెంట్‌లో ఈ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లో 10కి పైగా ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెడతారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

‘ఒక దేశం-ఒకే ఎన్నికల’ బిల్లు అంటే ఏమిటి?
వాస్తవానికి, ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఆరు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఈ ఏడాది జనవరిలో లా కమిషన్ రాజకీయ పార్టీలను కోరింది. ఈ బిల్లును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుండగా, మరోవైపు వివిధ‌ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కాగా జమిలి ఎన్నికలు అంటే , లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు జరుగుతాయి. లోక్ సభ ఎన్నికల తో పాటు మిగతా అసెంబ్లీల ఎన్నికలను జరుపుతారు. ఇందుకోసం పలు అసెంబ్లీల కాలపరిమితిని పెంచడం, మరికొన్నింటి కాలపరిమితిని తగ్గించడం చేస్తారు. ఈ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజార్టీతో రాజ్యాం గ సవరణ చేయాల్సి ఉంటుంది.

కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ఆగస్టు 11 వరకు సాగాయి. ఈ సందర్భంగా మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై ఉభయ సభల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. మణిపూర్‌ అంశంపై చర్చించాలని, ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి.

అయితే 22 రోజుల పాటు జరిగిన వర్షాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు గురించి కనీసం హింట్ కూడా ఇవ్వని అధికార బీజేపీ ఇప్పుడు ఆ బిల్లు కోస౦ ఏకంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనుకోవడం పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.