HomeTelanganaPolitics

BRS వైపే తెలంగాణ… ‘జనతా కా మూడ్’ సర్వే

BRS వైపే తెలంగాణ… ‘జనతా కా మూడ్’ సర్వే

ప్రఖ్యాత జనతా కా మూడ్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ ఈసారి నిర్వహించిన మరో సర్వేలో తెలంగాణలో ప్రజలు ఇంకా భారత్ రాష్ట్ర సమితి BRS వైపే ఉన్నారని

తెలంగాణలో టీడీపీ బస్సు యాత్ర.. ఇంతకు ఎవరికి లాభం చేకూర్చడానికి?
కాంగ్రెస్ బలంగా ఉన్న చోటే బీజేపీ కార్యక్రమాలు.. ఇది దేనికి సంకేతం?
మోడీ ఉపన్యాసంపై మండిపడ్డ బీజేపీ సీనియర్ నేత

ప్రఖ్యాత జనతా కా మూడ్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ ఈసారి నిర్వహించిన మరో సర్వేలో తెలంగాణలో ప్రజలు ఇంకా భారత్ రాష్ట్ర సమితి BRS వైపే ఉన్నారని తేల్చి చెప్పింది. తెలంగాణలో BRS గెలుస్తుందని బుధవారం న్యూఢిల్లీలో విడుదల చేసిన సర్వే నివేదికలో పేర్కొంది.BRSకు 41 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 34 శాతం ఓట్లు వస్తాయి. బీజేపీ 14 శాతం, ఏఐఎంఐఎం 3 శాతంతో మూడో స్థానంలో నిలుస్తాయని జనతా కా మూడ్ సర్వే తెలిపింది.

సీట్ల షేర్ల విషయానికొస్తే, బీఆర్‌ఎస్ 72 నుంచి 75 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 31 నుంచి 36 సీట్లు గెలుచుకోవచ్చని జనతా క మూడ్ సర్వేలో తేలింది. AIMIM 6 నుండి 7 వరకు గెలుస్తుంది. BJP 4 నుండి 6 స్థానాలతో నాల్గవ స్థానంలో నిలిచింది. ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌కు దగ్గరగా ఉన్నప్పటికీ, సీట్ల పరంగా బీఆర్‌ఎస్ కంటే చాలా వెనుకబడి ఉందని నివేదిక ఎత్తి చూపింది.
దాదాపు 18 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ 18 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ 4 చోట్ల‌, బీజేపీ చోట్ల లు ఆధిక్యంలో ఉండగా, బీఆర్‌ఎస్ 10 అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో ఉంది.

కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడానికి కర్ణాటకలో విజయమే కారణమని నివేదిక చెబుతోంది. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్ తన‌ హామీలను అమలు చేయలేకపోయిందని నివేదిక పేర్కొంది. కర్నాటకలో ఎన్నికల వాగ్దానాలకు, అమలుకు మధ్య ఉన్న వ్యత్యాసం ఓటర్లు ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ వంటి విషయాలలో కాంగ్రెస్ సామర్థ్యాన్ని అనుమానించేలా చేసింది. అందువల్ల తెలంగాణ ప్రజలు BRS అధ్యక్షుడు, ముఖ్యమంత్రి KCR పై తమ విశ్వాసాన్ని ఉంచారు. అంతే కాక కేసీఆర్ తో సరితూగే నాయకులు కాంగ్రెస్ లో లేరని సర్వే తేల్చింది. మరో వైపు, నాయకుల మధ్య గొడవలు, క్యాడర్ లో గందరగోళం కూడా
కాంగ్రెస్ కు నష్టం తేనున్నదని జనతా కా మూడ్ పేర్కొంది. కాంగ్రెస్ ఆరు హామీల ప్రభావం 30 నియోజకవర్గాల్లో ఎక్కువగానూ, 42 నియోజకవర్గాల్లో తక్కువగానూ ఉంది.

బీజేపీ విషయానికొస్తే, అంచనా వేసిన ఓట్ల శాతం 14 శాతం కాగా, 4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. బండి సంజయ్‌, జి కిషన్‌రెడ్డి నేతృత్వంలోని గ్రూపుల మధ్య గ్రూపిజం, అంతర్గత పోరుతో ఆ పార్టీ కూడా ఇబ్బందులు పడుతోందని సర్వే పేర్కొంది.

“తెలంగాణ ఓటర్లలో బిఆర్‌ఎస్‌కు ఆదరణ లభించడానికి అనేక అంశాలు దోహదం చేశాయి. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వం సాటిలేనిదని స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ లాంటి నాయకుడి స్థాయికి తగ్గ ముఖం రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష పార్టీకి లేదు. అంతేకాకుండా, రైతులు, యువకులు, మహిళలు, బీసీలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు లేదా చేతివృత్తులవారికోసం అమలు చేస్తున్న పథకాలు దేశానికే రోల్ మోడల్‌గా మారాయి. ”అని సర్వే పేర్కొంది.