HomeCinema

ఆ హీరోయిన్ ను రాత్రికి రూం కు రమ్మని హింసలు పెట్టిన తెలుగు హీరో ఎవరు ?

ఆ హీరోయిన్ ను రాత్రికి రూం కు రమ్మని హింసలు పెట్టిన తెలుగు హీరో ఎవరు ?

ఒకప్పటి హీరోయిన్ విచిత్ర తనకు 20 ఏళ్ళ క్రితం షూటింగ్ సమయంలో జరిగిన ఘోరమైన అనుభవం గురించి తాజాగా బహిర్గతపర్చింది. కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస

అమెరికా: తానాలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్ళు… ఎక్కడైనా తెలుగువాళ్ళు సత్తా చూపిస్తారన్న బాలకృష్ణ‌
ఇన్ స్టాగ్రామ్ లో పవన్ కల్యాణ్ మొదటి పోస్టు…4 గంటల్లో 30 లక్షల వ్యూస్
నారా లోకేష్ , బ్రాహ్మణి లది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట!

ఒకప్పటి హీరోయిన్ విచిత్ర తనకు 20 ఏళ్ళ క్రితం షూటింగ్ సమయంలో జరిగిన ఘోరమైన అనుభవం గురించి తాజాగా బహిర్గతపర్చింది. కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో పార్టిసిపెంట్లలో ఒకరైన‌ నటి విచిత్ర కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బైటపెట్టింది. 20 సంవత్సరాల క్రితం తాను ఒక తెలుగు చిత్రంలో పని చేస్తున్నప్పుడు జరిగిన ఘటన తాను సినిమా రంగం నుంచి వైదొలిగేలా చేసింది అని చెప్పారు. ఈ ఘటనపై యూనియన్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

విచిత్ర 1991లో సినిమాల్లోకి ప్రవేశించి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాల్లో నటించింది. ఈమె బిగ్ బాస్ తమిళ్ 7లో, ఆమె టాప్ పెర్ఫార్మర్స్‌లో ఒకరు. నిన్న (నవంబర్ 21) ఆమె 20 ఏళ్ల క్రితం సినిమా నుండి తప్పుకునేలా చేసిన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంది. తాను సినిమాలనుండి బైటికి వచ్చేలా చేసిన కొందరు దుర్మార్గుల గురించి ప్రపంచానికి ఇప్పటికైనా తెలియాలనిఇప్పుడు తన కథను పంచుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

విచిత్ర మాట్లాడుతూ, “2000లో, ఒక దివంగత నటుడు నాకు సినిమా చేయాలని సూచించాడు. షూటింగ్ కేరళలోని మలంపూజలో జరిగింది. అక్కడే నేను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. పెళ్లయిన తర్వాత నేను సినిమాలకు దూరమయ్యానని అందరికీ తెలుసు. అలా దూరమవడానికి పెళ్ళి కారణం కాదు ఆ భయంకరమైన సంఘటనే కారణం. ఈ సంఘటనను మర్చిపోవాలనుకున్నాను. కానీ ఈ గాయం చాలా తీవ్రంగా అయ్యింది. అది ఎప్పటికీ మానలేదు. ఈ సంఘటన గురించి చెప్పాలంటే, నేను కొందరు దెయ్యాలను ఎదుర్కొన్నాను. నా భర్త జనరల్ మేనేజర్‌గా ఉన్న ఒక 3-స్టార్ హోటల్‌లో మమ్మల్ని ఉంచారు. అక్కడ జరిగిన ఓ పార్టీలో నేను నటిస్తున్న మూవీలో హీరో (చాలా ప్రసిద్ధుడు) నా పేరు అడగలేదు, కానీ అతని తన గదికి రమ్మని అడిగాడు. నాకు అది పెద్ద షాక్. ఆ రాత్రి, నేను నా గదిలోకి వెళ్లి పడుకున్నాను. మరుసటి రోజు నుండి, నేను షూటింగ్ సమయంలో చాలా సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించాను.”

ఆమె ఇంకా మాట్లాడుతూ, “తమిళ చిత్రసీమలో నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేదు. సినిమాలో పనిచేసే వ్యక్తులు తాగి వచ్చి నా తలుపు కొట్టేవారు. ఆ శబ్దం నాకు ఇంకా వినపడుతూనే ఉంది. నేను చాలా బాధపడ్డాను.దీన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించాను. నా హోటల్‌కి కాల్స్ కనెక్ట్ చేయవద్దని నేను హోటల్ కుర్రాళ్లకు చెప్పేదానిని. అప్పటికి నాకు పరిచయం కూడా లేని ప్రస్తుతం నా భర్త, నేను ఏదైనా సమస్యలో ఉన్నానా, తానేమైనా సహాయం చేయగలనా అని అడిగాడు. నన్ను మరో గదికి మార్చమని అడిగాను. అతను , అతని బృందం మూవీ టీమ్‌కి తెలియజేయకుండా ప్రతిరోజూ నా గదిని మార్చగలిగారు. వారు ఇదంతా ఎలా చేశారో నాకు తెలియదు కానీ నాకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. నేనున్నానను కొని నా పాతగదిలో తలుపులు కొట్టేవారు. ఒక రోజు, వాళ్ళు సహనం కోల్పోయారు. నాకు గుణపాఠం చెప్పాలనుకున్నారు.”

“ఒక‌ ఫారెస్ట్ సీన్‌ని షూట్ చేస్తున్నాం, అక్కడ ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఎవరో నన్ను అనుచితంగా తాకినట్లు అనిపించింది. పొరపాటేమో అనుకున్నాను. సెకండ్ టేక్‌కి వెళ్లినప్పుడు మళ్లీ అదే జరిగింది. మూడో సారి కూడా అలాగే చేశారు. నేను ఆ వ్యక్తిని పట్టుకుని స్టంట్ మాస్టర్ వద్దకు తీసుకువెళ్ళాను. ఆ స్టంట్ మాస్టర్ నన్ను గట్టిగా కొట్టాడు. నేను మొత్తం యూనిట్ వైపు చూశాను . వారెవరూ నా కోసం మాట్లాడటానికి ముందుకు రాలేదు. వారు నన్ను గట్టిగా పట్టుకున్నారు గట్టిగా కొట్టారు. మొహం మీద నాకు రక్తం గడ్డకట్టింది. నా ముఖం మీద గుర్తులు పడ్డాయి.నేను కోపంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. భయం, కోపం , చాలా ఉద్వేగానికి లోనయ్యాను. ఈ విషయాన్ని నేను మా తల్లిదండ్రులకు చెప్పలేకపోయాను. నా స్నేహితుడికి చెప్పాను. ఆ వ్యక్తి నన్ను యూనియన్‌కు ఫిర్యాదు చేయమని చెప్పాడు.
“నేను యూనియన్‌కు ఫిర్యాదు చేశాను. వారు నన్ను తిరిగి వెనక్కి వచ్చేయమని చెప్పారు. ఇది వార్తాపత్రికలలో చాలా చర్చనీయాంశం అయిన సంఘటన. పోలీసులను ఆశ్రయించాను, లాయర్లను కలిశాను. రెండు రోజుల్లో, నా గాయాలు మానిపోయాయి. కానీ విచారణలో సాక్ష్యం చెప్పడానికి ఎవరూ కోర్టుకు రాలేదు. ఇప్పుడు నా భర్త విచారణ సమయంలో సాక్ష్యం ఇవ్వడానికి ముందుకొచ్చాడు. అప్పుడే నాకు అనిపించింది ఇక నా కెరీర్ ముగిసింది. నేను నా కుటుంబాన్ని ఎలా పోషించాలని ఆలోచించాను. యూనియన్ అధినేత నన్ను అన్నీ మర్చిపోయి తిరిగి పనికి వెళ్లమని సలహా ఇచ్చాడు. అప్పుడు నా భర్త నన్ను అడిగాడు, ‘కనీస గౌరవం లేని చోట నువ్వు పని చేయగలవా? మీరు ఇక్కడ ఉండటానికి అర్హులు కాదు’. ఇది నా ముఖం మీద చెంపదెబ్బలా అనిపించింది” అని ఆమె వివరించింది.
చిత్ర పరిశ్రమ తన కుటుంబమని తాను భావించానని, అయితే అది అబద్దమని గ్రహించానని విచిత్ర తెలిపారు. “ఇప్పుడు నా భర్త ఈ విషయమంతా విన్నాడు. నన్ను నటిగా కన్నా మనిషిగా చూసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతను నా హీరో. అతను నాకు అందమైన కుటుంబాన్ని, ముగ్గురు పిల్లలను ఇచ్చాడు. చాలా మంది నేరస్థులు తప్పించుకున్నారు. వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. అందుకే నేను సమస్యలకు వ్యతిరేకంగా నిలబడతాను. నాకు నయం కావడానికి 20-22 సంవత్సరాలు పట్టింది. ఇది నా పునరాగమనం , నేను దెయ్యాలను ఎదుర్కొంటున్నాను” అని ఆమె చెప్పింది .

ఇక విచిత్ర మాట్లాడిన ఈ వీడియోలో పలు చోట్ల మ్యూట్ అయ్యింది. మూవీ, హీరో పేర్లను మ్యూట్ చేసి ఉంటారని అభ్ప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, విచిత్ర‌ను రూం కు రమ్మన్న, హింసల పాలు చేసిన ఆ తెలుగు హీరో ఎవరనే చర్చ సోషల్ మీడియాలో తీవ్రంగా జరుగుతోంది. ఆ హీరో బాలకృష్ణ అని, అది ”భలేవాడివి బాసూ” అనే మూవీ షూటింగ్ సమయంలో జరిగిందని నెటిజనులు పలు ఇమేజ్ లను పోస్ట్ చేస్తున్నారు.