HomeEditor's ChoiceAndhra Pradesh

అమెరికా: తానాలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్ళు… ఎక్కడైనా తెలుగువాళ్ళు సత్తా చూపిస్తారన్న బాలకృష్ణ‌

అమెరికా: తానాలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్ళు… ఎక్కడైనా తెలుగువాళ్ళు సత్తా చూపిస్తారన్న బాలకృష్ణ‌

హెడ్డింగ్ చూసి కంగారు పడకండి రెండు వేరు వేరు వార్తలు కాని వేదిక ఒకటే. అమెరికాలోని ఫిల‌డెల్ఫియాలో జరుగుతున్న తానా సభలే ఆ వేదిక. అయితే తమ్ముళ్ళు తన్నుక

ఉచిత విధ్యుత్తు: రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ముసలం … అలా చెప్పడానికి రేవంత్ స్థాయి ఏంటని మండిపడ్డ కోమటి రెడ్డి
అమెరికన్ అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి
చంద్రుడి మీదికి చేరుకోవడానికి రష్యాకు ఒకట్టిన్నర రోజులు, అమెరికాకు నాలుగురోజులు పడితే మనకు 40 రోజులు… కారణమేంటి ?

హెడ్డింగ్ చూసి కంగారు పడకండి రెండు వేరు వేరు వార్తలు కాని వేదిక ఒకటే. అమెరికాలోని ఫిల‌డెల్ఫియాలో జరుగుతున్న తానా సభలే ఆ వేదిక. అయితే తమ్ముళ్ళు తన్నుకుని, అంతా సద్దుమణిగాక‌ జరిగిన సభలో బాలకృష్ణ మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు.

తానా సభల సందర్భంగా ఆ సంస్థలోని రెండు వర్గాలు తన్నుకున్నాయి. చొక్కాలు పట్టుకొని ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు.

ఫిలడెల్ఫియాలో జరిగిన తానా కార్యక్రమంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన భౌతిక దాడులకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ , లోకేష్ అభిమానుల మధ్య గొడవ జరిగిందని ప్రాథమిక నివేదికలు సూచించాయి. కాని విషయం అదికాదని కాస్త ఆలస్యంగా తేలింది. (తేలిందా తేల్చారా అనేది తేలాల్సి ఉంది.)

కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన తానా కార్యక్రమంలో భాగంగా జరిగిన పొలిటికల్ ఫోరమ్ కార్యక్రమంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

తానాలో ఇప్పటికే విభేదాలు ఉన్నాయి, కోమటి జయరామ్ కొంతకాలంగా సేకరించిన NRI నిధుల గురించి ప్రశ్నలను మరో వర్గం లేవనెత్తింది.

ఈ వ్యక్తులు జయరామ్, అతని బృందం నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
అమరావతి కోర్టు కేసులకు సంబంధించిన ఖర్చులు తదితరాలను పేర్కొంటూ ఏపీలోని రాజకీయ పార్టీకి సహాయం చేసేందుకు ఆసక్తి ఉన్న ఎన్నారైల నుంచి జయరామ్ నిధులు సేకరించినట్లు వార్తలు వచ్చాయి.

నిధులకు సంబంధించిన ఈ వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులు తన్నుకునేదాకా వెళ్ళింది. టీడీపీ ఎన్నారై అధ్య‌క్షుడు కోమ‌టి జ‌య‌రాంకు మద్దతు ఇస్తున్న‌ త‌ర‌ని ప‌రుచూరి, అతని వ్యతిరేక వర్గమైన‌ స‌తీష్ వేమ‌న వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం త‌న్నుకున్నాయి. చొక్కాలు ప‌ట్టుకుని ఈడ్చుకున్నారు. కాళ్ల‌తో త‌న్నుకున్నారు. చేతుల‌తో పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ దృశ్యాల్ని చూస్తున్న‌వారంతా ఏమ‌వుతుందోన‌నే భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

ఆ తర్వాత పలువురు పెద్దలు కలగజేసుకొని ఆ రెండు వర్గాలను శాంత పర్చారు. అనంతరం జరిగిన సభలో ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, తెలుగు వారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా సరే అక్కడ తమ సత్తా చాటుతున్నారని అన్నారు.ఈ సభలలో మహానటుడు ఎన్టీఆర్ కు నివాళి అర్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తానా క్యాన్సర్‌ క్యాంపులు నిర్వహించడం, బసవతారకం ఆసుపత్రికి సహాయాన్ని అందిస్తుండడం గొప్ప విషయం అని బాలకృష్ణ మెచ్చుకున్నారు.

మొత్తానికి అనకాపల్లి అయినా, అమీర్ పేట అయినా, అమెరికా అయినా సరే తమ తన్నుకునే సంస్కృతికి ఏ మాత్రం లోటు రానివ్వబోమని తెలుగువాళ్ళు నిరూపించడాన్ని చూసి గర్వపడదామా ?