HomeTelanganaPolitics

కెసిఆర్, సంజయ్ ల డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు: మంత్రి పొన్నం ప్రభాకర్

కెసిఆర్, సంజయ్ ల డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు: మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్: నినాదం పార్లమెంట్ ఎలక్షన్ల లో లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని వాటిని ప్రజలంతా గమనిస్తున్నారని మంత్రి పొన్నం ప

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరేది లేదా?
కేసీఆర్ MLA టికెట్స్ ప్రకటించిన గంటల్లోనే బీఆరెస్ కు గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే
నేను పవన్ కళ్యాణ్ భక్తుణ్ణి… ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తా

హుస్నాబాద్: నినాదం

పార్లమెంట్ ఎలక్షన్ల లో లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని వాటిని ప్రజలంతా గమనిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఐదు సంవత్సరాలు ఎంపీగా బండి సంజయ్ చేసింది ఏమీ లేదని ఎలక్షన్ల ముందు దీక్షలు ధర్నాలు పేరుతో డ్రామాలాడుతున్నాడని, టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రైతులను ముంచి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు

5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడి గా ఉండి ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోని
బండి సంజయ్ కి ఇప్పుడు రైతుల బాధ గుర్తొచ్చిందన్నారు. .. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, కేసీఆర్ ఇటు బండి సంజయ్ డ్రామాల దీక్ష లు చేసే బదులు ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ దగ్గర చేసి, నిధులు తీసుకురావాలన్నారు

గత వర్షాకాలలొ వర్షాలు పడలేవు.. నీటి ఎద్దడి ఉంది.. గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నాయన్నారు.వర్షాలు లేవు కరువు వచ్చిందన్నారు.కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందన్న వ్యక్తులకు కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.రాష్ట్రాన్ని ఆదుకోవాలని బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర దీక్ష చేయాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.విభజన హామీలు అమలు చేయని , తెలంగాణ విభజనను వ్యతిరేకించిన నరేంద్ర మోడీ దగ్గర ధర్నా చేసి..కేంద్రం దగ్గర నిధులు తీసుకురావాలన్నారు.ఎన్నికల్లో ఓట్ల కొరకు మొన్నటి దాక రాముడి ఫొటో పెట్టుకున్నారు.. నరేంద్ర మోడీ ఫొటో బంద్ చేశారన్నారు.ఈరోజు రైతుల దగ్గర మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.ఈరోజు కల్లాల దగ్గరకి ఓట్ల కోసం వస్తున్న సంజయ్ కల్లాల దగ్గర రైతులు కన్నిరు పెట్టుకున్నప్పుడు ఎక్కడ పోయిండన్నారు.కేసీఆర్ ఈరోజు ఎలక్షన్ల ముందు పొలాల బాట పట్టారు..4 నేలలు ఎక్కడ పోయిండన్నారు.

కాళేశ్వరం మునిగితే, క్రుంగితే సలహాలు ఇవ్వమంటే కేసిఆర్ ఎక్కడికి పోయిండన్నారు.కరువును రైతులను రాజకీయాల కోసమే వినియోగించుకుంటున్నారన్నారని, ఎద్దేవా చేశారు.ఇవాళ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్న ప్రధాన మంత్రి దగ్గర ప్రకృతి వైపరీత్యం సహకారం తీసుకురావడానికి మాతోపాటు ఢిల్లీకి రండి అన్నారు.ప్రభుత్వానికి సహకరించి కేంద్రం పై ఒత్తిడి తెద్దాం రమ్మని కోరుతున్నామన్నారు.