HomeTelanganaPolitics

నేను పవన్ కళ్యాణ్ భక్తుణ్ణి… ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తా

నేను పవన్ కళ్యాణ్ భక్తుణ్ణి… ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తా

సినీ నిర్మాత, నటుడు బండి గణేష్ మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలవకపోతే నాలుక కోసుకుంటానని ప్రకటించి,

కాంగ్రెస్ లో భగ్గుమన్న విబేదాలు…ఈసారి అజారుద్దీన్ వర్సెస్ విష్ణు వర్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గమే వేదిక‌
కాంగ్రెస్ కార్యకర్తల‌ను కాల్చి పడేస్తానన్న బీఆరెస్ ఎమ్మెల్యే
KCRతో తన రహస్య భేటీ గురించి బైటపెట్టి మోడీ కాంగ్రెస్ కు ఆయుధమిచ్చారా ?

సినీ నిర్మాత, నటుడు బండి గణేష్ మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలవకపోతే నాలుక కోసుకుంటానని ప్రకటించి, కాంగ్రెస్ ఓటమి తర్వాత ”చాలా మాటలు అంటాం ప్రతీదీ ఆచరిస్తామా ?” అని మాట మార్చేశాడు.

ఇక ఈ బండ్ల గణేష్ హీరో పవన్ కళ్యాణ్ కు తాను భక్తుడిని అని చెప్పుకుంటాడు. మరో వైపు కాంగ్రెస్ కార్యకర్తనని కూడా చెప్తాడు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పవన్ పార్టీ అయిన జనసేన ప్రత్య్ర్థులుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బండ్ల గణేష్ మద్దతు ఎటువైపు ఉంటుందనేది ఆసక్తిదాయకమే కదా ! అదే విషయాన్ని ఓ మీడియా ప్రతినిధి గణేష్ ను ప్రశ్నించాడు. అందుకు గణేష్ ఏమన్నాడంటే….?

”నేను పవన్ భక్తుణ్ణి, ఈ విషయాన్ని ఎవరైనా కాదనగలరా? పవన్ కోసం నా ప్రాణమైనా ఇస్తాను. నేను కాంగ్రెస్ కార్యకర్తను. ఎవరికి మద్దతు ఇస్తానో మీరు ఊహించలేరా ? పవన్ కోసం ఏమైనా చేస్తాను. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా నిలబడతాను ఆ పార్టీ గెలుపుకోసం ప్రచారం చేస్తాను.” అని ప్రశ్న అడిగిన మీడియా ప్రతినిధికి షాక్ ఇచ్చాడు.