HomeTelanganaPolitics

కేసీఆర్ MLA టికెట్స్ ప్రకటించిన గంటల్లోనే బీఆరెస్ కు గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే

కేసీఆర్ MLA టికెట్స్ ప్రకటించిన గంటల్లోనే బీఆరెస్ కు గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే

ఒకే సారి 115 MLA మంది అభ్యర్థులను ప్రకటించి బీఆరెస్ లో కేసీఆర్ జోష్ నింపగా మరో వైపు ఆ పార్టీలో అప్పుడే రాజీనామాలు మొదలయ్యాయి. తన్కు టికెట్ ఇవ్వకుండా

కాంగ్రెస్ కు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా… త్వరలోనే బీఆరెస్ లో చేరిక‌
మల్కాజీగిరి ఎంపీగా పోటి చేయడానికి పట్టుబడుతున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ఓడిపోతుందని తెలిసీ ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా ?

ఒకే సారి 115 MLA మంది అభ్యర్థులను ప్రకటించి బీఆరెస్ లో కేసీఆర్ జోష్ నింపగా మరో వైపు ఆ పార్టీలో అప్పుడే రాజీనామాలు మొదలయ్యాయి. తన్కు టికెట్ ఇవ్వకుండా మరో అభ్యర్థిని ప్రకటించడంతో ఓ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

ఖానాపూర్ నియోకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ను కాకుండా కేటీఆర్ స్నేహితుడైన జాన్సన్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో అసంతృప్తితో రగిలిపోయిన రేఖానాయక్ కు బీఆరెస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

బీఆరెస్ కు రాజీనామా చేసి ఆమె కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కొద్ది సేపటిక్రితం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి దాదాపు గంటసేపు చర్చలు జరిపారు అనంతరం ఆయనకు రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎమ్మెల్యే రేఖానాయక్ రేపు బీఆరెస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం. అభ్యర్థుల తొలి లిస్ట్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇలా బీఆరెస్ కు షాక్ తగలడం ఆ పార్టీ నాయకులకు మింగుడుపడటం లేదు.

కాగా, టిక్కట్ ఆశించి బంగపడ్డ మరికొంత మంది బీఆరెస్ నాయకులు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తమ పార్టీలో చేరనున్నట్టు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు.