HomeTelanganaUncategorized

తక్షణమే కులగణన ప్రక్రియను ప్రారంభించాలి:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తక్షణమే కులగణన ప్రక్రియను ప్రారంభించాలి:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తక్షణమే కులగణన ప్రక్రియను ప్రారంభించాలి ఈ బడ్జెట్ నుంచే బీసీలకే రూ. 20 వేల కోట్లు కేటాయించాలి అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం 12న మహాధర్నా

ఆ గుర్తున్న‌ రూ.500 నోట్లు నకిలీవా ?
అభ్యర్థిగా గంగుల కమలాకర్, అంబరాన్నంటిన సంబరాల్లో కరీంనగర్.. నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గంగులను ప్రకటించిన సీఎం కేసీఆర్
బెంగళూరులో డబుల్ సూపర్ ఓవర్… టీమిండియా గెలుపు

తక్షణమే కులగణన ప్రక్రియను ప్రారంభించాలి

ఈ బడ్జెట్ నుంచే బీసీలకే రూ. 20 వేల కోట్లు కేటాయించాలి

అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం 12న మహాధర్నా

వికారాబాద్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వికారాబాద్: ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టే ప్రక్రియను మొదలుపెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రక్రియ మొదలుపెడితేనే ఆరు నెలల్లో కులగణనను పూర్తి చేయగలరని అన్నారు. కులగణను పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను 42 శాతానికి పెంచితే స్థానిక సంస్థల్లో దాదాపు 24 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అవుతారని కాంగ్రెస్ పార్టీయే చెప్పిందని గుర్తు చేశారు.

బీసీ హక్కుల సాధన కోసం బుధవారం నాడు వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… బ్రిటీష్ హయాంలో 1931లో చివరి సారి కులగణన జరిగిందని, అప్పుడు 4300పైగా బీసీ కులాలు ఉన్నాయని తేలిందని ప్రస్తావించారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు మాత్రం దేశంలో కేవలం దాదాపు 2400 బీసీ కులాలు ఉన్నాయని అంటున్నాయని, బీసీ కులాల సంఖ్యపైనే స్పష్టత లేక అయోమయ పరిస్థితుల నేపథ్యంలో కులగణన చాలా అవసరమని నొక్కి చెప్పారు. అలాగే, బీసీల సంక్షేమ కోసం ప్రతి ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, కాబట్టి ఈ 2024-25 బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని అన్నారు. లేదంటే బీసీలు ఈ ఏడాది రూ. 20 వేల కోట్లు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.

అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేసి సాధించినప్పుడు దళిత సంఘాలు సంతోషించాయని, ఇప్పుడు కూడా పూలే విగ్రహ ప్రతిష్టాపన సాధన కోసం అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటుపై ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని అల్టిమేటం జారీ చేశారు. పూలే విగ్రహ సాధన కోసం ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహించబోతున్నామని, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర వంటి నుంచి రాజకీయాలకు అతీతంగా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

2018 నుంచి ఇప్పటి వరకు 4365 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో కేవలం 1195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నాయని లేవనెత్తారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని చెప్పారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు కేవలం 3 శాతం మాత్రమే ఎంపికయ్యారని వివరించారు. వెనుకబడిన వర్గాలు కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడం లేదని, కాబట్టి బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ. 26 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీలకు కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు.

భారత జాగృతిగా రూపాంతరం చెందిన తెలంగాణ జాగృతి అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోకొట్లాడి బతుకమ్మకు రాష్ట్ర హోదా, నిరాహార దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం సాధించామని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 20 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించేలా చేశామని, దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చకు ప్రేరేపించామని, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోటా ఇవ్వాలని కూడా పోరాటం చేశామని వివరించారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు, నాయకులు బొల్ల శివశంకర్, ఏల్చల దత్తాత్రయ, తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.