HomeNationalGeneral

ఆ గుర్తున్న‌ రూ.500 నోట్లు నకిలీవా ?

ఆ గుర్తున్న‌ రూ.500 నోట్లు నకిలీవా ?

మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా లో ఆక్టీవ్ అయిపోయిన తర్వాత ఏ రాతలు, నిజమైనవో ఏవి అబద్దమో తెలియడం కష్టంగా మారింది. కొన్ని నిజాలు అబద్దాల లా

రీల్స్ పిచ్చి… ఐఫోన్ కోసం కన్న కొడుకును అమ్మేసిన జంట‌
చీమను చంపడానికి సుత్తిని వాడతారా… ఫేక్ న్యూస్ పై ప్రభుత్వ రూల్స్ అతిగా ఉన్నాయన్న‌ హైకోర్టు
సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న AI కేసీఆర్

మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా లో ఆక్టీవ్ అయిపోయిన తర్వాత ఏ రాతలు, నిజమైనవో ఏవి అబద్దమో తెలియడం కష్టంగా మారింది. కొన్ని నిజాలు అబద్దాల లాగా, మరికొన్ని అబద్దాలు నిజాల లాగా ప్రచారం చేయడం కొందరు నెటిజనులు పనిగా పెట్టుకుంటున్నారు. ఇందులో కొందరికి రాజకీయ కారణాలుంటే, మరి కొందరు పనీ పాట లేక ఉబుసుపోక ఇలా౦టి పనులు చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో 500 రూపాయల నకిలీ నోట్లు మార్కెట్లో వెల్లువెత్తాయని , అందులో నంబర్ల మధ్యలో ఒక నక్షత్రం ఉందని పేర్కొన్నారు. కొంత మంది దగ్గరికి ఈ నోటు వస్తే వారు సకాలంలో బ్యాంకులో జమచేశారని , మీరు కూడా అలాగే చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ పోస్ట్ ను చూసిన చాలా మంది తమ దగ్గరున్న నెంబర్ మధ్యలో స్టార్ ఉన్న నోట్లు తమదగ్గర ఉంటే భయపడిపోతున్నారు. అయితే నిజానికి అటువంటి స్టార్ ఉన్న నోట్లు నకిలీవి కావు. ప్రెస్ ఇన్ఫర్ మేషన్ బ్యూరో PIB ఫ్యాక్ట్ చెక్ లో ఈ మెసేజ్ అబద్దమని తేలింది. మార్కెట్లో దొరికే స్టార్ నంబర్లతో కూడిన ఈ రూ.500 నోట్లు 2016 డిసెంబర్‌లో ఆర్‌బీఐ ప్రవేశ పెట్టింది. అందువల్ల ప్రజలు ఇటువంటి ఫేక్ న్యూస్ లను నమ్మొద్దని PIB కోరింది.