HomePoliticsNational

ప్రభుత్వాల చర్చల పిలుపు మోసపూరితమైనది, అయినా మేము సిద్దమే! అయితే…. మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ప్రభుత్వాల చర్చల పిలుపు మోసపూరితమైనది, అయినా మేము సిద్దమే! అయితే…. మావోయిస్టు పార్టీ ప్రకటన‌

మావోయిస్టులతో తాము చర్చలకు సిద్దంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ,ఛత్తీస్ గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఇటీవల చేసిన బహిరంగ ప్రకటనకు సీపీఐ మావో

కుకీ, కేంద్రం శాంతి ఒప్పందానికి డేట్ ఫిక్స్ కాగానే మణిపూర్ లో హింస రేగడానికి కారణమెవరు ?
మోడీ తర్వాత ప్రధాని అమిత్ షానే యోగికి నో ఛాన్స్
30 పార్టీలు Vs 24 పార్టీలు… దేశంలో వేడి పుట్టిస్తున్న రాజకీయాలు

మావోయిస్టులతో తాము చర్చలకు సిద్దంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ,ఛత్తీస్ గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఇటీవల చేసిన బహిరంగ ప్రకటనకు సీపీఐ మావోయిస్టు స్పంధించింది. చర్చల ప్రకటన మోసపూరితమైనదని, అయినప్పటికీ దేశ పీడిత వర్గాల, ప్రత్యేక సామాజిక సెక్షన్ల ప్రజల విస్తుత ప్రయోజనాల దృష్ట్యా శాంతిని నెలకొల్పడం కోసం మా పార్టీ చర్చల కోసం ఎప్పుడైనా సిద్ధమని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటన విడుదల చేశారు.

వికల్ప్ ప్రకటన పూర్తి పాఠం….

చర్చల ప్రస్తావన చిత్తశుద్ధి లేనిది – అసలైన నిజం నిర్బంధమూ, మోసమే

(సందర్భం: ఛత్తీస్ గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ద్వారా మావోయిస్టులతో చర్చల ప్రస్తావన)

ప్రజల విస్త్రుత ప్రయోజనాలు, శాంతి నెలకొల్పే దిశలో
భాకపా (మావోయిస్టు) ఎల్లప్పుడూ చర్చలకు సిద్దమే!

మావోయిస్టులతో ప్రత్యక్షంగా కానీ మొబైల్ ద్వారా (వర్చ్వల్ గా) కానీ చర్చలకు సిద్ధమని ఛత్తీస్ గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, కేంద్ర హోం మంత్రి ఇటీవల బహిరంగ ప్రకటన చేశారు. పలువురు పాత్రికేయులు, మేధావులు దీనిపై మా ప్రతిస్పందనను కోరారు. మావోయిస్టులతో చర్చల ప్రస్తావన ఉప ముఖ్యమంత్రి చేసి వుండొచ్చు, దానికంటే ముందు ముఖ్యమంత్రి లేదా కేంద్ర హోం మంత్రి చేసి వుండొచ్చు, కానీ అది నిజాయితీ లేనిదనీ, ప్రజలను మోసపుచ్చేదనీ మా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ రాష్ట్ర, దేశ జర్నలిస్టు మిత్రులకు, ప్రజాస్వామ్య, ప్రగతిశీల మేధావులకు, సభ్య సమాజానికి, ఆదివాసీ, ఆదివాసేతర సామాజిక సంఘాలకు, పౌర, మానవ హక్కుల సంఘాలకు, ప్రజలకు తెలియచేస్తున్నది.

ఈ సందర్భంగా అమానవీయ నిర్బంధ సూరజ్ కుండ్ పథకంలో భాగంగా ఆపరేషన్ కగార్ పేరుతో 1 జనవరి నుండి కేంద్ర, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాల ద్వారా పాల్పడుతున్న చుట్టుముట్టు దాడులను మా పార్టీ మీ దృష్టికి తేవాలనుకుంటున్నది. వీలయినంత త్వరలో మావోయిస్టులను తుదముట్టిస్తామని కేంద్ర హోం మంత్రి పదే పదే ప్రకటిస్తున్న విషయం మీకు తెలుసు. ఆపరేషన్ కగార్ లో భాగంగా బీఎస్ఎఫ్, ఐటీబీపీకి చెందిన 6 వేల మంది బలగాలను బస్తర్ సంభాగ్ లోని ‘అబూఝ ‘మాడ్ (నారాయణపుర్ జిల్లా)లో దింపారు. ఈ బలగాలతో 40 కొత్త పోలీసు క్యాంపులను వేయనున్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెలన్నర రోజుల్లోనే జనవరి 1 నుండి ఫిబ్రవరి 4 వరకూ ఎదురు కాల్పులు, క్రాస్ ఫైరింగ్స్ పేరుతో పాల్పడిన బూటకపు ఎదురుకాల్పుల్లో బస్తర్ సంభాగ్ లోని దంతెవాడ, సుకుమా, బీజాపుర్, నారాయణపుర్ జిల్లాల్లో 10 మంది ఆదివాసులను దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. వీరిలో 6 నెలల పసికూన కాక ఇద్దరు మహిళలూ, ప్రాచీన తెగల్లో ఒకటైన మాడియా ఆదివాసీ సముదాయానికి చెందిన ఒక గ్రామస్తుడు వున్నాడు. ఒక ఆదివాసీ మహిళ, ఒక ఆదివాసీ రైతుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి గాయపర్చారు. బస్తర్ సంభాగ్ లోని ఈ ఆదివాసుల నరసంహారం ప్రాకృతిక సంపదలను, వనరులను కార్పొరేట్లపరం చేయడానికి తప్ప మరెందుకూ కాదు.

పైన పేర్కొన్న బూటకపు ఎదురుకాల్పుల హత్యలే కాక గత నాలుగేళ్లకు పైగా బస్తర్ సంభాగ్ లో జరుగుతున్న ప్రజా పోరాటాలపై భయానక నిర్బంధం కొనసాగుతున్నది. పదుల సంఖ్యలో ప్రజా పోరాట నాయకులను, కార్యకర్తలను అబద్ధపు కేసుల్లో ఇరికించి జైల్లలో బంధిస్తున్నారు. ధర్నా శిబిరాలను ధ్వంసం చేస్తున్నారు. పోరాటాల్లో పాల్గొంటున్న ప్రజలను కనికరం లేకుండా కొడుతున్నారు. ఒకవైపు ఇలా ఫాసిస్టు నిర్బంధకాండ, మరోవైపు చర్చల ప్రస్తావన. ఇది ప్రభుత్వ ద్వంద్వనీతి మాత్రమే కాదు, ప్రజలను భ్రమపెట్టే విఫల ప్రయత్నం.

దేశ పీడిత వర్గాల, ప్రత్యేక సామాజిక సెక్షన్ల ప్రజల విస్తుత ప్రయోజనాల దృష్ట్యా శాంతిని నెలకొల్పడం కోసం మా పార్టీ చర్చల కోసం ఎప్పుడైనా సిద్ధమని మా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఎల్లప్పుడూ చెప్తూ వస్తున్నది. ఈ సందర్భంలో మరొకసారి బహిరంగంగా ప్రకటిస్తున్నది.

మేం ఈ సందర్భంలో స్పష్టంగా చెప్పదల్చుకున్నది ఏంటంటే చర్చల కోసం పార్టీలోనూ, ప్రజలతోనూ సలహా-సంప్రదింపులు, అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వాలు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలి. ఇందులో భాగంగా ఎదురుకాల్పులు, క్రాస్ ఫైరింగుల పేరుతో బూటకపు ఎదురుకాల్పుల్లో ఆదివాసులు దారుణ హత్యలను ఆపివేయాలి. మొత్తం ప్రభుత్వ సాయుధ బలగాలను 6 నెలల వరకూ బ్యారక్ (పోలీసు స్టేషన్లు, క్యాంపు)లకు పరిమితం చేయాలి. మా పార్టీతో చర్చలకు ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి వుంటే అది ముందుగా ఈ కనీస చర్యలను అమలుచేయాలి. అప్పుడు ప్రత్యక్షంగానైనా, వర్చ్వల్ గానైనా చర్చలకు వస్తాము. చర్చల విధి-విధానాలు, ఎజెండా, ఇతర విషయాలు విడిగా నిర్ణయించుకోవచ్చు.

అందుకని ప్రజలపై కొనసాగుతున్న ప్రభుత్వ నిర్బంధకాండకు వ్యతిరేకంగా దృఢంగా గళమెత్తాలని, ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని, చర్చలకు అనుకూల వాతావరణాన్ని నెలకొల్పే దిశలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మా పార్టీ ప్రజాపక్ష పాత్రికేయులకు, పౌర సమాజానికి, ప్రగతిశీల, ప్రజాస్వామిక మేధావులకు, పౌర హక్కుల, మానవ హక్కుల సంఘాలకు మనవి చేస్తున్నది.

వికల్ప్,
అధికార ప్రతినిధి,
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ,
భాకపా (మావోయిస్టు)