HomeTelanganaCrime

బట్టబయలైన 250 కోట్ల భారీ కుంభకోణం

బట్టబయలైన 250 కోట్ల భారీ కుంభకోణం

•చైన్ సిస్టంతో ప్రజలను బురిడీ?•ఇచ్చిన నగదుకు డబల్ అంటూ ఆశ…?•నమ్మి చేరి నట్టేట మునిగిన ప్రజలు..?•మూడు జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన కుంభకోణం..

ఫైర్ ఫైర్స్‌ది ఫైర్… ఎవరనుకున్నారు? కేఏ పాల్ ఇక్కడ
మేక దొంగతనం నెపంతో దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేసిన నిందితుల అరెస్ట్
తెలంగాణ: ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్

•చైన్ సిస్టంతో ప్రజలను బురిడీ?
•ఇచ్చిన నగదుకు డబల్ అంటూ ఆశ…?
•నమ్మి చేరి నట్టేట మునిగిన ప్రజలు..?
•మూడు జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన కుంభకోణం..?
•తీగలాగే పనిలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు…?

కోదాడ,జనవరి 27
(నినాదం న్యూస్):
మనందరికీ మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో ఆ సినిమా ఒక సంచలనం. ఆ సినిమాలో చిరంజీవి చెబుతూ ఉంటారు నువ్వు ఒక ముగ్గురికి సహాయం చెయ్ ఆ ముగ్గురిని తలా ముగ్గురికి సహాయం చేయమని చెప్పు అలా అందరూ సహాయం చేసుకోవడం వల్ల సమస్యలు ఉండవని ప్రతి పేదవాడు ఆనందంగా జీవిస్తారని చెబుతాడు. అక్షరాల అలాగే ఓ చైన్ సిస్టం స్టాలిన్ సినిమాను తలపించేలా భారీ కుంభకోణాన్ని తెర తీసింది. ఒకటి రెండు లక్షల కాదు.. ఏకంగా కోట్లకు ఎగబాకి సుమారు 250 కోట్లకు పైగా భారీ కుంభకోణానికి దారితీసింది.ఒక వ్యక్తి 50 వేలు కడితే నెలకి లక్ష రూపాయలు ఇస్తానంటూ ఘరానా మోసం జరిగింది.
ఓ వ్యక్తి 50 వేల రూపాయలు కట్టి ఆ వ్యక్తి నలుగురిని చేర్పిస్తే అతనికి లక్ష రూపాయలు వస్తాయని నమ్మబలికి 250 కోట్ల స్కాం చేశారు. 50 వేల నుండి 10 లక్షల వరకు కడితే మీకు డబల్ వస్తాయంటూ మోసం చేశారు.

కోదాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు, హుజూర్నగర్ మండలం మాధవరాయ గూడెం చెందిన ముగ్గురు వ్యక్తులు, గరిడేపల్లి మండలం చెందిన ఇద్దరు వ్యక్తులు ,నేలకొండపల్లి ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది తోపాటు విజయవాడకు చెందిన మెయిన్ లీడర్ ను పతంగి టోల్ ప్లాజా దగ్గర స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం… విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. లక్షకి రెండు లక్షలు 10 లక్షల 20 లక్షలు అంటూ జనాలను మోసం చేసిన ఈ కేసులో పోలీసులు తీగలాగి డొంక కదిలించే పనిలో ఉన్నారు. ఈ కుంభకోణం లో ఇంకా ఎంతమంది హస్తముందో అనే కోణంలో విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తుంది.