HomeAndhra Pradesh

ఎస్మా ప్రయోగం.. అంగన్వాడీలను తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం

ఎస్మా ప్రయోగం.. అంగన్వాడీలను తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం

వేతన పెంపు, ఉద్యోగ భద్రత.. తదితర డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వారు నిర్వహించి ఛలో విజయవాడ్ అకార

రాజ్ భవన్ ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా… ‘ కార్మికులారా ! నేను మీ వైపే’ అని గవర్న‌ర్ ట్వీట్
మొదలైన సంక్షోభం: AI కి వ్యతిరేకంగా పోరాటం షురూ…స్తంభించిన హాలీవుడ్
అంగన్‌వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం.. సమ్మె కొనసాగింపు

వేతన పెంపు, ఉద్యోగ భద్రత.. తదితర డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వారు నిర్వహించి ఛలో విజయవాడ్ అకార్యక్రమాన్ని అడ్డుకొని అనేక మందిని అరెస్టు చేసిన ప్రభుత్వం ఇప్పుడు వారిని ఎస్మా ఉపయోగించి ఉద్యోగాలనుంచి తొలగిస్తోంది.

ఎస్మా చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ అంగన్వాడీ ఉద్యోగులు విధుల్లో చేరకపోవడంతో విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించేందుకు కలెక్టర్లు చర్యలు చేపడుతున్నారు. అంగన్వాడీలకు టర్మినేషన్ లెటర్లు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీసేసిన అంగన్వాడీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 25న కొత్త నియామక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికీ విధులకు హాజరుకాని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు.