HomeCinema

నేను కనిపిస్తే పెళ్ళి చేయాలని చూస్తున్నారు – విజయ్ దేవరకొండ‌

నేను కనిపిస్తే పెళ్ళి చేయాలని చూస్తున్నారు – విజయ్ దేవరకొండ‌

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర కొండ కొన్ని మీడియా సంస్థలపై విరుచుకపడ్డారు. తాను కనిపిస్తే పెళ్ళి చేయాలని ఆ మీడియా చూస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. తన పె

సోషల్ మీడియాలో తారల దేశభక్తి
తాను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాడో చెప్పిన నిర్మాత దిల్ రాజు
‘నీ పాటలు పాడుకోకుండా ఈ భజన కార్యక్రమాలు ఏంది భ‌య్యా !’

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర కొండ కొన్ని మీడియా సంస్థలపై విరుచుకపడ్డారు. తాను కనిపిస్తే పెళ్ళి చేయాలని ఆ మీడియా చూస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. తన పెళ్ళికి తన కన్నా, తన కుటుంబంకన్నా కొన్ని మీడియా సంస్థలకే తొందర ఎక్కువయ్యిందని ఆయన మండిపడ్డారు.

కొన్ని మీడియా సంస్థలు తమ రేటింగుల కోసం రెండురోజులకు ఓ సారి తనకు పెళ్ళి చేసేస్తున్నాయన్నారు. ఎప్పట్లాగానే ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మికపై కొన్ని ఊహాగానాలు వచ్చాయి. వీటి గురించే విజయ్ దేవరకొండ పైవిధంగా స్పందించారు. రూమర్లలో పేర్కొన్నట్టుగా ఫిబ్రవరిలో తనకు నిశ్చితార్థమేమీ జరగడంలేదని, పెళ్లి కూడా జరగడంలేదని వివరణ ఇచ్చారు.
పనికిమాలిన రూమర్లు సృష్టించేబదులు ప్రజలకు అవసరమైన వార్తల మీద దృష్టిపెట్టాలని ఆయన హితవు పలికారు.