HomeNational

జనవరి 22న రాముడు అయోద్యకు రావడంలేదని నాతో చెప్పాడు

జనవరి 22న రాముడు అయోద్యకు రావడంలేదని నాతో చెప్పాడు

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబ‍ంధించి రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భా

నిన్న అయోద్యలో రెచ్చిపోయిన జేబు దొంగలు
ప్రభాస్ న్యూస్…. అదంతా ఫేక్
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా గాంధీ

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబ‍ంధించి రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాల్ ప్రసాద్ యాదవ్ కుమారుడు , RJD నాయకుడు తేజ్ ప్రతాప్ సింగ్, ఒక వీడియోలో ప్రజలను “శ్రీరాముడు జనవరి 22 న మాత్రమే అయోధ్యకు వస్తాడా?” అని అడిగాడు. జనవరి 22న తాను అయోధ్యకు రానని రాముడు తనకు కలలో చెప్పాడని యాదవ్ పేర్కొన్నాడు. శంకరాచార్యుల‌కు కూడా కలలో కనపడి తాను ఆరోజు అయోద్యకు రానని రాముడు చెప్పాడన్నారు. వారు (బిజెపి) నాటకం చేస్తున్నారు …ఎన్నికలు పూర్తయ్యాక వాళ్ళు రాముడిని పట్టించుకోరు. అన్నాడు.

బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్ర శేఖర్ మాట్లాడుతూ, “మీకు గాయమైతే, మీరు ఎక్కడికి వెళతారు? గుడికా లేదా ఆసుపత్రికా? ఫతే బహదూర్ సింగ్ (RJD ఎమ్మెల్యే) చెప్పిన దాంట్లో తప్పేముంది ? సావిత్రిబాయి ఫూలే చెప్పిన మాటనే ఆయన చెప్పారు.ఇక్కడ తప్పేముంది?అతను సావిత్రిబాయి ఫూలేని ఉటంకించాడు.విద్య అవసరం లేదా?… నకిలీ హిందూవాదం, నకిలీ జాతీయవాదం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి… రాముడు మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ప్రతిచోటా నివసిస్తున్నాడు. అలాంటప్పుడు మీరు అతని కోసం ఎక్కడికో ఎందుకు వెళతారు?” అని అన్నారాయన‌