వైసీపీలో అసంతృప్తి మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పు ప్రక్రియతో మనస్తాపం చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే
వైసీపీలో అసంతృప్తి మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పు ప్రక్రియతో మనస్తాపం చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే రాజీనామా చేయగా, ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా రాజీనామా చేశారు.
బాలశౌరి జనసేన వైపు అడుగులు వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన మరో రెండ్రోజుల్లో పవన్ ను కలిసి జనసేన కండువా కప్పుకునే అవకాశాలున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ బాలశౌరి జనసేనలో చేరితే… ఆ పార్టీ తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలున్నాయి.
బాలశౌరి వైసీపీని వీడుతారని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో జగన్ ఫొటోలకు బదులు వైఎస్సార్ ఫొటోలు పెడుతుండడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.
బాలశౌరి రాజీనామా వైసీపీకి భారీ షాక్‌గా మారింది. ఆయన వైసీపీలో ఒక బలమైన నాయకుడు కావడంతో ఆయన రాజీనామాతో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.