HomePoliticsCinema

వర్మ మళ్ళీ గెలికాడు… అచ్చుగుద్దినట్టు పవన్ ను దించేశాడు

వర్మ మళ్ళీ గెలికాడు… అచ్చుగుద్దినట్టు పవన్ ను దించేశాడు

ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మకు పవన్ కళ్యాణ్ అన్నా, చంద్రబాబు అన్నా గిట్టదనే విషయం తెలిసిందే. సందు దొరికినప్పుడల్లా వారిపై సెటైర్లు వేస్తూ ఉంటా

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారైనట్టేనా ?
రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపి కలిసి పోటీ చేస్తాయి… ప్రకటించిన‌ పవన్
జనసేనలోకి ముద్రగడ పద్మనాభం ?

ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మకు పవన్ కళ్యాణ్ అన్నా, చంద్రబాబు అన్నా గిట్టదనే విషయం తెలిసిందే. సందు దొరికినప్పుడల్లా వారిపై సెటైర్లు వేస్తూ ఉంటాడు వర్మ. అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే మాత్రం వర్మకు సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు గా కనిపిస్తూ ఉంటుంది.

వర్మ తాజాగా వ్యూహం పేరుతో వైఎస్ జగన్ బయోపిక్ తీస్తూ ఉన్నాడు. అయితే అది బయోపిక్ కాదని అంతకు మించి రియల్ పిక్ అని వర్మ చెప్పుకుంటూ ఉన్నాడు. జగన్ పాత్ర ను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. వైఎస్ భారతి పాత్ర లో మానస రాధాకృష్ణన్ అనే యువతి పోషిస్తుంది. ఈ మూవీలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుకున్నాడు. చంద్రబాబు పాత్ర పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు వర్మ పవన్ కళ్యాణ్ పాత్రను రివీల్ చేశాడు. ఇందులో పవన్ పాత్ర ధారి తెలుపు దుస్తులు ధరించి….మెడలో పార్టీ కండువా వేసుకుని…నేల పై పడుకుని పైన ఏవో లెక్కపెడుతున్నట్లు వేలు చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. సేమ్ సేమ్ పవన్ ఆహార్యాన్ని దించేశాడు వర్మ అని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.

అసలు ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. జగన్, చంద్రబాబుల రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాల మీదనే మూవూ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించంది చేయడమే వర్మ ప్రత్యేకత కదా !
అయితే ఈ పోస్టర్ ను చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్మపై భగ్గుమంటున్నారు. తమకు అలవాటైన బూతులతో వర్మపై దాడులు చేస్తున్నారు.