HomeTelanganaPolitics

కాంగ్రెస్, సీపీఐ పొత్తు పొడిచింది

కాంగ్రెస్, సీపీఐ పొత్తు పొడిచింది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అనేక చర్చోపచర్చల అనంతరం చివరకు సీపీఐకి కొత్తగూడెం సీటు తో పాటు ఒక ఎమ్మెల్

BRS వైపే తెలంగాణ… ‘జనతా కా మూడ్’ సర్వే
BRS వాళ్ళకు తుపాకులు కావాలేమో మేము కంటి చూపుతో చంపేస్తాం… జగ్గారెడ్డి
BRS టూ BRS వయా కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అనేక చర్చోపచర్చల అనంతరం చివరకు సీపీఐకి కొత్తగూడెం సీటు తో పాటు ఒక ఎమ్మెల్సీ ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకుంది.

మరో వైపు సీపీఎం తో మాత్రం కాంగ్రెస్ కు ఏకాభిప్రాయం కుదరలేదు దాంతో సీపీఎం 20 స్థానాల్లో తాను ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించింది. తామడిగిన రెండు సీట్లు కూడా కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో సీపీఎ‍=మ్ ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా ఖమ్మం జిల్లాలో సీపీఎం కు ఒక సీటు కేటాయిస్తే ఆ పార్టీతో పొత్తు కుదిరే విధంగా తాము ప్రయత్నిస్తామని సీపీఐ నాయకులు కాంగ్రెస్ నేతలకు సూచించారు. అయితే ఆ అంశం తమ చేతుల్లో లేదని అధిష్టానంతో చర్చించిన తర్వాత‌ చెప్పగలమని రేవంత్ రెడ్డి సీపీఐ నాయకులతో చెప్పినట్టు సమాచారం.

అయితే ఇక్కడ‌ మరో మెలిక ఏమంటే.. నల్లగొండ జిల్లా మునుగోడులో కాంగ్రెస్ తో పాటు సీపీఐ కూడా అభ్యర్థిని నిలబెట్టనుంది. ఇరు పార్టీలు స్నేహపూర్వక పోటీకి దిగనున్నాయి.