HomeTelanganaPolitics

గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలు తపించిన గ్రామ సర్పంచ్

గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలు తపించిన గ్రామ సర్పంచ్

-గ్రామ సర్వతోముఖాభివృద్ధి కోసం పదవి చివరి రోజు 167000 వేల తో రూప్ లైట్ల ఏర్పాటు -గ్రామ పంచాయతీ అభివృదే ధ్యేయంగా పని చేసిన సర్పంచ్ -ఉత్తమ గ్

హైదరాబాద్ నగరంలో వరద పరిస్థితిని పరిశీలించిన కేటీఆర్…ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచన‌
గద్దర్ అన్న యాదిలో సభ ను విజయవంత చేయండి
ఎవర్ నార్త్ గ్లోబల్ సామర్థ్య కేంద్రం ఏర్పాటుతో వెయ్యి మందికి కొత్తగా ఉద్యోగాలు – మంత్రి శ్రీధర్ బాబు.

-గ్రామ సర్వతోముఖాభివృద్ధి కోసం పదవి చివరి రోజు 167000 వేల తో రూప్ లైట్ల ఏర్పాటు

-గ్రామ పంచాయతీ అభివృదే ధ్యేయంగా పని చేసిన సర్పంచ్

-ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నో అవార్డులు సాధించిన లింగ్యా తండా సర్పంచ్ గుగులోత్ రాంలాల్ నాయక్

డోర్నకల్ జనవరి 30(నినాదం న్యూస్ )

సర్పంచ్ పదవి కాలం చివరి రోజు వరకు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలు తపించి గ్రామ పంచాయతీ నిధుల నుండి 1,67,000 వేల రూపాయలతో రూప్ లైట్లను సర్పంచ్ గుగులోత్ రాంలాల్ నాయక్ ఏర్పాటు చేశారు. మారుమూల గ్రామమైన కురవి మండలం లింగ్యా తండా (బి ) గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం సర్పంచ్ పదవి చేపట్టిన నుండి పదవి చివరి రోజు వరకు సుమారుగా 3 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేశారు.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ రాజకీయ నాయకుడి లా ఆలోచించకుండా గ్రామ పంచాయతీకి ఓట్లేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి సేవకుడిగా పని చేశానన్నారు.డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీ మాలోత్ కవిత సహాయ సహకారాలతో గ్రామపంచాయతీని అభివృద్ధిలో పరుగులు పెట్టించానని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నో అవార్డులను పొంది. మారుమూల లింగ్యా తండా గ్రామపంచాయతీ పేరును తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల చర్చించుకునే విధంగా సర్పంచులకే ఆదర్శంగా నిలిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేశానన్నారు.లింగ్యా తండా జిపి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా,స్వలాభం ఆలోచించకుండా సర్పంచ్ పదవి చేపట్టిన నుండి పదవి కాలం చివరి రోజు వరకు అహర్నిశలు శ్రమించి చిరకాలం ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించుకున్నానన్నారు.గతంలో ఏ గ్రామ పంచాయతీలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను లింగ్యా తండా గ్రామంలో జరిగిందన్నారు. తండకు నలుమూలల నుండి లింకు రోడ్లు,సీసీ రోడ్లు,సోలార్ లైట్లు,డ్రైనేజ్ కాలువలు,గ్రామపంచాయతీకి ఇంటర్నెట్ సౌకర్యం,పల్లె ప్రకృతి వనం,డంపింగ్ యార్డ్,స్మశాన వాటిక,విద్యుత్ స్తంభాలు, కరెంట్ లైన్ ఇలా అనేక సంక్షేమ,అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేశానన్నారు.