HomeTelanganaPolitics

ఉపా, అర్బన్ నక్సల్స్ పేరుతో తెలంగాణలో ఎంతో మందిపై కేసులు పెడుతున్నారు : మధు యాష్కి గౌడ్

ఉపా, అర్బన్ నక్సల్స్ పేరుతో తెలంగాణలో ఎంతో మందిపై కేసులు పెడుతున్నారు : మధు యాష్కి గౌడ్

రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తాము హైకోర్టుకు వెళ్లామని.. ప్రస్తుతం ఆ విచారణను 66 రోజుల పాటు పెండింగ్‌లో పెట్టారని మధు యాష్కి చెప్పారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో…బిఆర్ఎస్ లో లుకలుకలు
మధుయాష్కీ, పొంగులేటికి కాంగ్రెస్ లో కీలక పదవులు
కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ : పేర్లు ఇవేనా?

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నియంత పోకడలు, అవినీతి పాలనపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ అన్నారు. దేశంలో ప్రతీ వ్యక్తికి స్వేచ్ఛ, సమానత్వాలు కలిగించిందని కాంగ్రెస్ అని ఆయ చెప్పారు. ఒకే నేరంపై వివిధ రాష్ట్రాల్లో కేసులు వేయడం, దానిని కోర్టు సమర్థించడం చాలా బాధగా ఉందని మధు యాష్కి చెప్పారు.

రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తాము హైకోర్టుకు వెళ్లామని.. ప్రస్తుతం ఆ విచారణను 66 రోజుల పాటు పెండింగ్‌లో పెట్టారని మధు యాష్కి చెప్పారు. దేశంలోని కోర్టులపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉందని చెప్పారు. ఉపా కేసులు పెట్టి వరవరరావు లాంటి వారిని బీజేపీ జైల్లో పెట్టిందని మండిపడ్డారు. తెలంగాణలో కూడా అనేక మందిపై అర్బన్ నక్సల్స్ పేరుతో కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని మధుయాష్కి ఆరోపించారు.

ఎలక్టోరల్ బాండ్ల పేరుతో బీజేపీకి రూ.10,130 కోట్లు, బీఆర్ఎస్‌కు రూ.350 కోట్ల నిధులు వచ్చాయని.. ఇంత పెద్ద మొత్తంలో ఆ రెండు పార్టీలకు నిధులు ఎలా వచ్చాయని మధు యాష్కి ప్రశ్నించారు. ఇలాంటి వాటిని తాము ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని మధు యాష్కి నిలదీశాలు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నియంత, అవినీతి పాలనపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

తాము మౌన దీక్ష చేస్తున్నది కేవలం రాహుల్ గాంధీ కోసం మాత్రమే కాదని.. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కోసమని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే బీసీలు దగ్గర కావాలని మధు యాష్కి పిలుపు నిచ్చారు. పార్టీకి దూరమైన వర్గాలను దగ్గర చేయాలని రాహుల్ గాంధీ, ఖర్గే ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాజిక న్యాయం జరగలేదని అన్నారు. బీసీలను బీఆర్ఎస్ పార్టీ అణచివేస్తోందని అన్నారు. ఒక కులం మాత్రమే ముందుకు వెళ్లితే.. ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదని.. కాంగ్రెస్‌లో బీసీలకే సీఎం పదవులు వస్తున్నాయని మధు యాష్కి తెలిపారు.