HomeTelanganaPolitics

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ : పేర్లు ఇవేనా?

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ : పేర్లు ఇవేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు పరిశీలన కోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దాదాపు 300 మంది అభ్యర్థుల పేర్లను కేంద్ర ఎన్నికల కమిట

ఇకపై నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు – రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
త్వరలో రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు: సీఎం రేవంత్ రెడ్డి
కారు సర్వీసింగుకు వెళ్ళింది, మరింత స్పీడ్ గా వస్తుందన్న‌ కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు పరిశీలన కోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దాదాపు 300 మంది అభ్యర్థుల పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి)కి పంపినట్లు తెలుస్తోంది. నిన్న ఢిల్లీలో ఏడు గంటలకు పైగా జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 60 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంటి సీనియర్‌ నేతల పేర్లు ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

కాంగ్రెస్ టిక్కెట్ కో కేటాయింపు కోసం ఎన్నికల వ్యూహకర్త సునీల్ కానుగోలు నేతృత్వంలోని బృందం నుండి సర్వే నివేదికలు, ఇన్‌పుట్లను పార్టీ అధిష్టానం తీసుకుంది. ఆ వివరాల ఆధారంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో వెనుకబడిన కులాలకు రెండు స్థానాలు రిజర్వ్‌ చేసే అంశంపై చర్చసాగుతోంది.

దాదాపు 60 నియోజక వర్గాల్లో ఏకాభిప్రాయం వచ్చినట్టు నాయకులు చెప్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

తొలి జాబితాలో చోటు దక్కే పలువురు అభ్యర్థులు:
రేవంత్ రెడ్డి
భట్టి విక్రమార్క
ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సీతక్క
పోదెం వీరయ్య
శ్రీధర్ బాబు
జగ్గారెడ్డి
దామోదర్ రాజనర్సింహ
జీవన్ రెడ్డి
జి. వినోద్
షబ్బీర్ అలీ
సంపత్ కుమార్
వంశీ చంద్ రెడ్డి
గడ్డం ప్రసాద్ కుమార్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తుమ్మల నాగేశ్వరరావు
జూపల్లి కృష్ణారావు
ఫిరోజ్ ఖాన్
ప్రేమ్ సాగర్ రావు
అంజన్ కుమార్ యాదవ్
ఉత్తమ్ పద్మావతి రెడ్డి
మల్‌రెడ్డి రంగారెడ్డి
విజయ రమణారావు
అడ్లూరి లక్ష్మణ్ కుమార్
వంశీకృష్ణ