HomePoliticsNational

జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్‌

జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్‌

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఆయన స్థానంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా శాసన సభా పక్షం చంపై సోరెన్ ను తమ నా

సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ, కరోనా లాంటిది; దాన్ని నిర్మూలించాలి – ఉధయనిధి స్టాలిన్
‘నేను శివభక్తుడిని, అయినా బజరంగ్ దళ్ వాళ్ళు నా షాప్ కాల్చేశారు’
GHMC పరిథిలో విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు రేపు,ఎల్లుండి సెలవులు

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఆయన స్థానంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా శాసన సభా పక్షం చంపై సోరెన్ ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఈ నిర్ణయానికి కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది. చంపై సోరెన్ జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఆయన హేమంత్ మంత్రివర్గంలో రవాణా మంత్రి ఉన్నారు.

“మేము చంపై సోరెన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నాము. ప్రమాణ స్వీకారోత్సవం కోసం గవర్నర్‌ను అభ్యర్థించడానికి మేము రాజ్‌భవన్‌కు వచ్చాము” అని జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా రాజ్‌భవన్ వెలుపల విలేకరులతో అన్నారు.

సీఎం హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని, కొత్త శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్‌ ఎంపికయ్యారని… ఎమ్మెల్యేలంతా మా వెంటే ఉన్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజేష్‌ ఠాకూర్‌ అన్నారు.

‘సీఎం హేమంత్ సోరెన్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన‌ తన రాజీనామాను సమర్పించేందుకు ఈడీ బృందంతో గవర్నర్ వద్దకు వెళ్లారు… చంపై సోరెన్ కొత్త ముఖ్యమంత్రి అవుతారు.. మా వద్ద తగినంత సంఖ్యాబలం ఉంది.’ అని జేఎంఎం ఎంపీ మహువా మజీ చెప్పారు.