HomeTelanganaPolitics

అది ఫ్రస్ట్రేషనా ? బెధిరింపులా ? తమ‌ వాళ్ళను నిలబెట్టుకునే ప్రయత్నాలా?

అది ఫ్రస్ట్రేషనా ? బెధిరింపులా ? తమ‌ వాళ్ళను నిలబెట్టుకునే ప్రయత్నాలా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన్ నాటి నుండి బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మాటలు వింటే అనేక అనుమానాలు ర

కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?
ABP-C ఓటర్ సర్వే : తెలంగాణలో కాంగ్రెస్ దే విజయం
మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ఓడిపోతుందని తెలిసీ ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన్ నాటి నుండి బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మాటలు వింటే అనేక అనుమానాలు రావడం ఖాయం. ”ఈ ప్రభుత్వం ఆరునెలల్లో కూలిపోతుంది” ”కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదని ప్రజలు ఏడుస్తున్నారు” ”కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు” ”కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు” ”కాంగ్రెస్ కు మనకూ ఉన్న ఓట్ల తేడా రెండు శాతమే” ”ఆరునెలల్లో ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడతారు”

ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కేటీఆర్ అనేక మీటింగుల్లో అంటున్న మాటలివి? ఈ మాటల వల్ల నిజంగానే ఆరునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ బీఆరెస్ అధికారంలోకి వస్తుందని కొందరు అమాయక బీఆరెస్ కార్యకర్తలు నమ్మొచ్చేమో కాని ప్రజలు నమ్ముతారా ? ఒక వేళ నిజంగానే తాము గెలిపించిన ప్రభుత్వాన్ని కూల‌గొడితే ప్రజలు ఊరుకుంటారా ? అసలు నిజంగానే ఊదితే కూలిపోయేంత బలహీనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా ? ఇవన్ని ప్రశ్నలకు జవాబులు కాసేపు పక్కనపెడితే అసలు తాను మాట్లాడుతున్న మాటలు నిజమనై కేటీఆర్ అనుకుంటున్నారా అనేది అసలు ప్రశ్న.

తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చి. ముచ్చటగా మూడవసారికూడా తామే అధికారంలోకి వస్తామని బీఆరెస్ అగ్రనాయకత్వం నమ్మింది. కార్యకర్తల్లో కూడా అదే నమ్మకం నింపింది. ఒక రాజకీయ పార్టీగా అది అలా చేయడంలో తప్పు లేదు. అయితే ఊహించని విధంగా ఓడిపోవడంతో కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. నిన్నటి దాకా అన్ని రకాల అధికారం అనుభవించినవాళ్ళకు ఈ ఓటమి ఊహించని శరాఘాతంలా తగిలింది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు చాలామంది నాయకులు అధికారంలేనిది ఉండలేరు. వాళ్ళకు పార్టీ ఏదనేది ముఖ్యమే కాదు. పవర్ లో ఉండటమే అంతిమ లక్ష్యం. అందుకే అలాంటి వారంతా అధికార కాంగ్రెస్ వైపు వలసపోవడం ప్రారంభించారు. ఇప్పటికైతే ఎమ్మెల్యే స్థాయిలో వలసలు మొదలుకాకపోయినా మున్సిపాలిటీ, కార్పోరేషన్ లలో గంపగుత్తగా పార్టి మారిపోతున్నారు.ఇదేమీ ఊహించనిపరిణామం కాదు. ఇలా జరుగుతుందని బీఆరెస్ నాయకత్వానికి మాత్రం తెలియదా ? గతంలో వాళ్ళు చేసినపని కూడా ఇదే కదా ?
తెలంగాణ ఏర్పడిన తర్వాత‌ జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లో గెలిచిన బీఆరెస్ తమకు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కుంది. అధికారం కోసం, ఇతర ప్రలోభాల వల్ల అనేక మంది పొలోమంటూ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు అప్పటి టీఆరెస్ లో చేరిపోయారు. అదే పని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పై స్థాయిలో కాకుండా కింది స్థాయిలో ప్రారంభించింది. బీఆరెస్ అధికార‍ంలో ఉన్న అనేక కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ఆ పార్టీ కార్పోరేటర్లు, కౌన్సిలరు మొత్తానికి మొత్తంగా కాంగ్రెస్ లోకి వలసలు పోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడం ఏలా అన్నది బీఆరెస్ నాయకత్వానికి కూడా తెలియడంలేదు. పైగా పార్లమెంటు ఎన్నికల తర్వాత అనేక మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ తమతో నిలబెట్టుకోవాలంటే త్వరలో మళ్ళీ తామే అధికారంలోకి రాబోతున్నామనే నమ్మకం వాళ్ళకు కల్పించడం బీఆరెస్ నాయకత్వానికి అత్య‌వసరంగా మారింది. ఒకవైపు ఓడిపోయామన్న ఫ్రస్టేషన్ తో పాటు ఈ అవసరం కూడా ఏర్పడం తో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆరునెలల్లో మళ్ళీ మనమే అనే మాటలు మాట్లాడక తప్పని పరిస్థితి. ఒకప్పుడు ఉద్యమ పార్టీగా 2014 తర్వాత పచ్చి రాజకీయ పార్టీగా మారిన బీఆరెస్ పార్టీని కాపాడుకోవాలంటే అబద్దాలు, అర్ద సత్యాలు, ఊహలు…ఏవైనా సరే మాట్లాడి తమ వాళ్ళలో భ్రమతో కూడిన నమ్మకాన్ని నాటడం తక్షణావసరం. మరీ వీళ్ళు కోరుకుంటున్నట్టు ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కూలిపోతుందా ? మళ్ళీ బీఆరెస్ అధికారంలోకి వస్తుందా ? వీటికి జవాబు జిల్లాల్లో , కార్పోరేషన్ లలో, మున్సిపాల్టీలలో బీఆరెస్ నాయకులు స్పష్టంగానే చెప్తున్నారు.