సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయిన నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం తె
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయిన నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు.
నిందితుడిని స్పెషల్ సెల్ IFSO యూనిట్ పట్టుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 465 (ఫోర్జరీ) , 469 (పరువుకు హాని కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ) కింద ఉంది. ఈ కేసు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 66C , 66Eల కిందికి కూడా వస్తుంది.
నటి ప్రమేయం ఉన్న ‘డీప్‌ఫేక్’ వీడియోను సుమో-మోటోగా స్వీకరించిన ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) నుండి వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ చట్టపరమైన చర్య తీసుకున్నారు.