HomeTelanganaPolitics

మోడీతో ప్రైవేటు మీటింగ్ లో మాట్లాడిన సంచలన విషయాలు బైటపెట్టిన కేసీఆర్

మోడీతో ప్రైవేటు మీటింగ్ లో మాట్లాడిన సంచలన విషయాలు బైటపెట్టిన కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒకరిపై ఒకరు అబద్దాలు, అర్దసత్యాలు, కొన్ని నిజాలతో ప్రతి రోజూ విరుచుకపడుతున్నారు. ఒకరిపై ఒకరు చేసుకుంటు

కేటీఆర్ కు తప్పిన ప్రమాదం
బీఆరెస్ కు ఓటమి భయం పట్టుకుందా ? రంగంలోకి పీకేను దించిన కేసీఆర్ ?
ఎన్నికల్లో బీఆరెస్సే గెలుస్తుందని చెప్పేసిన బండి స‍ంజయ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒకరిపై ఒకరు అబద్దాలు, అర్దసత్యాలు, కొన్ని నిజాలతో ప్రతి రోజూ విరుచుకపడుతున్నారు. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలతో ప్రజలకు అన్ని పార్టీల లొసుగులు, వేశాలు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండియా టుడే ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీతో తన సమావేశంలో జరిగిన చర్చ గురించి చెప్పిన విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ ఓ బహిరంగసభలో మాట్లాడుతూ, కేసీఆర్ తన దగ్గరికొచ్చి తాము ఎన్ డీ ఏ లో చేరతామని, తమను చేర్చుకోవాలని బతిమాలాడుకున్నాడని తెలిపారు. తన కుమారుడు కేటీఆర్ ను ముఖమంత్రిని చేయాలనుకుంటున్నాని, మీరు ఆశీర్వదించాలని తనను కేసీఆర్ కోరాడని మోడీ చెప్పారు. అయితే తాను అంగీకరించలేదని తెలిపారు.

అయితే మోడీ మాట్లాడిన ఈ మాటలను అటు కేసీఆర్, ఇటు కేటీర్ లు ఖండించారు. మోడీ పై తీవ్ర విమర్శలు చేశారు. తాను ముఖ్యమంత్రి అవ్వడానికి మోడీ అనుమతి ఎందుకని కేటీఆర్ బహిరంగంగానే ప్రశ్నించారు. తాము ఎన్ డీ ఏ లో చేరతామని అడగలేదని వాళ్ళు స్పష్టం చేశారు.

కాగా, రెండు రోజుల క్రితం కేసీఆర్ ఇండియా టుడే కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఇండియాటుడే ప్రతినిధులు ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ పూర్తి విరుద్దంగా మాట్లాడారు.

ఇండియా టుడే ప్రతినిధి : ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన ప్రచార సభలో ప్రధానమంత్రి, 2021లో ఎన్‌డిఎలో చేరుతామని మీరు తనను సంప్రదించారని పేర్కొన్నారు. ఇది నిజమేనా?
కేసీఆర్: అతను తన మనసుకు నచ్చినవి , తనకు అనుకూలమైన కథలు చేప్తే నేనేం చేయగలను? నిజానికి నేను సీఎం, ఆయన ప్రధాని. నేను కనీస రాష్ట్ర-కేంద్ర సంబంధాలను కొనసాగించాలి. వాళ్లు నన్ను ఎన్డీయేలో చేరమని అడిగారు. కానీ నేను ముందు మీరు రాష్ట్రానికి ఏదైనా మంచి చేయండి, ఆపై చేరవచ్చు అని చెప్పాను. కానీ వాళ్ళు తెలంగాణకు ఏ మేలు చేయడం లేదు. మోడీదీ ప్రధాని కాకపోయి ఉంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4 లక్షలకు పెరిగి ఉండేది. చాలా పనులను ఆపుతున్నారు. మోడీ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంపై ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత కూడా ఆయన సొంత గవర్నర్లే బిల్లులను అడ్డుకుంటున్నారు. ఇది నేరం. తెలంగాణా గవర్నర్ [తమిలిసై సౌందరరాజన్] BJP తమిళనాడు యూనిట్ మాజీ అధ్యక్షురాలు. చాలా బిల్లులను తన వద్దే పెపట్టుకుని మూర్ఖపు, థర్డ్ క్లాస్ రాజకీయాలు ఆడుతోంది.

ప్ర: రాష్ట్ర రాజకీయాల్లో మీ కుమారుడు విజయం సాధించాలని (ముఖ్యమంత్రి కావాలని) మోడీ ఆశీస్సులు కోరినట్లు కూడా చెప్పారు.
కేసీఆర్: తాను 50 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నందున 70 ఏళ్లు వచ్చే సరికి రిటైర్మెంట్‌ గురించి ఆలోచించవచ్చని ప్రైవేట్‌గా మాట్లాడితే, దాన్ని ప్రజలకు వెల్లడించాలా? ఆయనే కేటీఆర్ గురించి ఆరా తీశారు. కాబట్టి, మీరు ప్రధానమంత్రి అయినందున, కేటీఆర్ కు మీ ఆశీస్సులు అందజేయండి, అతనికి సహకరించండి అని నేను అతనిని అడిగాను. ఇలాంటి వ్యక్తిగత సంభాషణలను రాజకీయ వేదికపై వెల్లడించడం ప్రధానికి తగునా?

ఇది ఇండియా టుడే తో కేసీఆర్ సంభాషణ… మరి గతంలో తాము ఎన్డీఏ లో చేరే చర్చే జరగలేదని, కేటీఆర్ ను ఆశీర్వదించాలని తాను అడగలేదని చెప్పిన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇప్పుడేం జవాబు చెప్తారు.

ఇండియాటుడే ఇంటర్వ్యూ: