HomeNationalGeneral

‘పాండవుల వల్లే ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది..అదీ భారత్ గొప్పతనం’

‘పాండవుల వల్లే ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది..అదీ భారత్ గొప్పతనం’

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ దాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఇండియా తీం ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి పోవడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశ‌కు గురి చేస

పాక్ జట్టుకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ బిర్యానీ
తన్నుకున్న సినీ తారలు.. ఆరుగురికి గాయాలు, పలువురు ఆసుపత్రి పాలు
శ్రీల‍ంక క్రికెట్ ను జై షా నాశనం చేస్తున్నాడు ‍- అర్జున రణతుంగ సంచలన ఆరోపణ‌

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ దాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఇండియా తీం ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి పోవడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ఇండియా ఫైనల్ లో ఎందుకు ఓడిపోయిందనడానికి కారణాలను పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు.

క్రికెట్ నిపుణులు పలువురు భారత ఆట‌గాళ్ళ ఆట తీరుపై విమర్శలు చేశ్తూ ఉంటే, ఫ్యాన్స్ కూడా తమకు తోచిన విశ్లేషణలు చేస్తూ సంత్రుప్తి పడుతున్నారు.

ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మార్కండేయ క‌ట్జూ ఈ రోజు ఓ కొత్త వాదన తెరపైకి తీసుకవచ్చారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో చేసిన ట్వీట్ వైరల్ అయ్యి నెటిజనుల ట్రోలింగ్ కు గురవుతోంది.

ఇంతకూ ఆయనేమన్నాడంటే…”పాండవుల ‘అస్త్రాల’ నిల్వ కేంద్రంగా ఆస్ట్రేలియా ఉండేది. దీనిని ‘అస్త్రాలయ’ అని పిలిచేవారు. ప్రపంచకప్ గెలవడానికి అసలు కారణం ఇదే.” అని ఆయన ట్వీట్ చేశారు.

ఇదే విషయంపై ఫేస్ బుక్ లో నిన్న అరుణాంక్ లత అనే నెటిజన్ వ్యగ్యంగా ఇదే అర్దంలో ఓ పోస్ట్ చేశాడు.

”ఇండియా ఓడి భారత్ గెలిచి నిలచిన వేళ
ఇండియా ఓడిపోయింది అని మీరనుకుంటున్నారేమో… కాని నిజానికి గెలించింది భారత్. పాండవులు అస్త్రాలు, అంగ వస్త్రాలు దాచిన చోటే అస్త్రేలియా. సింపుల్ గా చెప్పాలంటే అస్త్ర్ లియా. ఆ విషయం తెలుసు గనుకే షమీ, సిరాజ్ లు ఇబ్బడిముడిగా పరుగులిచ్చారు. సంస్కృతానికీ, బొందుత్వానికి (బంధుత్వం తప్పు పదం. బొడ్డు ఉత్వమే బొందుత్వం అయింది.) పునర్ వైభవం తేవాలనుకుంటున్న విశ్వగురు సరిగ్గా ‘అస్త్ర్ – ఏ – లియా’ గెలుస్తుందని తెలిసాకే గ్రౌండ్లో అడుగు పెట్టాడు.
ఆయన పేరు మీదున్న స్టేడియంలో, ఆయన చేతుల మీదుగా ఎప్పుడో విడిపోయిన బొందుత్వం ఇవాళ మళ్ళీ కలిసింది. మనవాళ్ళు మాక్స్ వెల్ నీ, వార్నర్ ని ప్రేమించడంలో కూడా అంతరంతారాల్లో దాగిన బొందుత్వ డీఎన్ఏ కారణం. ఈ విషయాన్ని నాసా తన అంతరిక్ష కేంద్రంలో పరిశోధన చేసింది.
ఎన్డీయే హయాంలో ఒక్క కప్పూ భారత్ గెలవలేదు. ఆయన రాకతో కాంగీ ఇందిరా పుట్టిన రోజున భారత్ కప్పు గెలిచింది.
మళ్ళీ మళ్ళీ ఆయనే
చేతిలో చిప్పా ఖాయమే” ఇదీ అరుణాంక్ చేసిన పోస్ట్.

కాగా, కట్జు చేసిన ట్వీట్ పై నెటిజనులు అనేక రకాలుగా స్పంధిస్తున్నారు… ”ఆస్ట్రేలియా అఖండ భారత్‌లో భాగం.
ప్రాచీన గ్రంథాలలో అస్త్ర ఆలయ గా పేర్కొనబడింది. ఇది 322 BCEలో చంద్రగుప్త మౌర్యచే స్థాపించబడిన పురాతన మౌర్య సామ్రాజ్యం యొక్క ఆయుధాలు , మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న ఒక భారీ ఆయుధశాలను కలిగి ఉంది.

అందుకే, భారతదేశం ఓడిపోవచ్చు కానీ అఖండ భారత్ గెలిచింది.” అని ఓ నెటిజన్ వ్యగ్యంగా కామెంట్ చేయగా, ”బాధపడకండి సార్, మన ప్రధాన మంత్రి ఆస్ట్రేలియా పేరును అస్త్రాలయగా మార్చేస్తారు” అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

”ఇప్పటికైనా మీరు మిస్టరీ ఛేధించారు. ఆ రోజు ఆస్ట్రేలియా మెరుగైన క్రికెట్ ఆడుతుందని, మెరుగైన బౌలింగ్, ఫీల్డింగ్ , బ్యాటింగ్ చేస్తుందని, టాస్ గెలిస్తుందని, ధైర్యంగా , తెలివిగా నిర్ణయం తీసుకుని, ఆ మ్యాచ్ గెలుస్తుందని నాకు నమ్మకం లేకుండే. గెలుపుకు అసలు కారణాన్ని కనుగొన్న‌ మీ గొప్ప జ్ఞానోదయానికి ధన్యవాదాలు సార్…” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.