HomeEditor's ChoiceInternational

ఇజ్రాయిల్ కు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా

ఇజ్రాయిల్ కు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా

పశ్చిమాసియాలో ఇజ్రాయిల్, పాలస్తీనా ల మధ్య యుద్దం నేపథ్యంలో సౌదీ అరేబియా ఇజ్రాయిల్ తో శాంతి ఒప్పంద చర్చలను నిలిపివేసినట్లు నివేదించబడింది. గత వారం ఇజ్

గాజాలో ఇజ్రాయిల్ నరమేధం – ప్రతి 15 నిమిషాలకు ఓ చిన్నారి మృతి
ఇజ్రాయిల్ పై 5వేల రాకెట్లతో దాడి చేసిన హమస్
ఇజ్రాయిల్ పై హమస్ దాడికి ఇరాన్ మద్దతు

పశ్చిమాసియాలో ఇజ్రాయిల్, పాలస్తీనా ల మధ్య యుద్దం నేపథ్యంలో సౌదీ అరేబియా ఇజ్రాయిల్ తో శాంతి ఒప్పంద చర్చలను నిలిపివేసినట్లు నివేదించబడింది. గత వారం ఇజ్రాయిల్ గాజాపై క్రూరమైన దాడిని ప్రారంభించిన తర్వాత బహుశా దౌత్యపరంగా ఇది పెద్ద దెబ్బ తగలవచ్చు.

కొన్ని నివేదికల ప్రకారం, హింస ఆగే వరకు చర్చలను సౌదీ అరేబియా స్తంభింపజేస్తోందని జెరూసలేం పోస్ట్ నివేదించింది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా గురువారం ఇరాన్ అధ్యక్షుడు ఎబ్రహం రైసీతో మాట్లాడారు, హమాస్ గ్రూపుకు మద్దతుగా ఉన్న ఇరాన్‌ను ఒంటరిగా చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల నుండి వెనక్కి తగ్గే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.

పాలస్తీనాపై ఇజ్రాయిల్ పాల్పడుతున్న యుద్ధ నేరాలకు ముగింపు పలకాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని బహిరంగంగా ఖండించాలని యునైటెడ్ స్టేట్స్ సౌదీ అరేబియాను డిమాండ్ చేసింది, అయితే సౌదీ విదేశాంగ మంత్రి ఫర్హాన్ సౌద్ అమెరికా డిమాండ్ ను తోసిపుచ్చినట్టు TASS వార్తా సంస్థ నివేదించింది.

ఇజ్రాయెల్ బలమైన మిత్రదేశమైన యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా , ఇజ్రాయెల్ మధ్య చర్చలలో మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇది ఇరాన్ యొక్క ప్రాంతీయ ఆశయాలకు ఆటంకం కలిగిస్తుంది.

అయితే, నెతన్యాహు యొక్క సంకీర్ణ భాగస్వాములు పాలస్తీనియన్లతో ఎలాంటి రాజీకి సిద్దంగా లేరు. “మేము పాలస్తీనియన్లకు ఎలాంటి రాయితీలు ఇవ్వము. ” అని తీవ్రవాద మతపరమైన జియోనిజం పార్టీ నాయకుడు బెజలెల్ స్మోట్రిచ్ అన్నారు.

ఇదిలా ఉండగా, సౌదీ అరేబియా , ఇజ్రాయెల్‌ల ప్రమేయం లేకుండా ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య శాంతి సాధ్యమయ్యే అవకాశం లేదని అమెరికా చేయగలిగింది తక్కువే అని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.

కాగా, వారం పాటు సాగిన యుద్ధం ఇప్పటికే ఇరువైపులా 3,500 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. ఈ ప్రాంతం అంతటా ఉద్రిక్తతలను పెంచింది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 2,215 మందికి పెరిగింది, వీరిలో 724 మంది పిల్లలు కాగా 458 మంది మహిళలు ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు, గత వారం నుండి ఇజ్రాయెల్‌లో హమాస్ దాడిలో 1,300 మందికి పైగా మరణించారు.