HomeTelanganaPolitics

ఇకపై నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు – రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

ఇకపై నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు – రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. సినిమా రంగంలో ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటిం

కరెంట్ బిల్లులు చెల్లించొద్దన్న కేటీఆర్ పై మంత్రి భట్టి ఆగ్రహం
కారు సర్వీసింగుకు వెళ్ళింది, మరింత స్పీడ్ గా వస్తుందన్న‌ కేటీఆర్
త్వరలో రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. సినిమా రంగంలో ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల సినీ ప్రముఖులు తనను కలిశారని, ఆ సందర్భంలో నంది అవార్డులను పునరుద్దరించాలని వారు అడినట్లు చెప్పారు. అయితే ఆ సమయంలో వారికి ఒక విషయం స్పష్టం చేశాను అన్నారు. ” అవార్డులు ఇస్తాము అయితే అవి నంది అవార్డులు కాదు వాటి పేరు ఇకపై గద్దర్ అవార్డులు. ఆ అవార్డులను మా ప్రభుత్వం అధికారికంగా ఇస్తుంది.” అని తాను చెప్పానన్నారు.
”తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డులు అని పేరు పెట్టుకుందాం” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి గద్దర్ అవార్డు పేరు ప్రకటించగానే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కమ్యూనిస్ట్ నాయకులు ఆయన నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇందుకు సంబంధించి త్వరలో జీవో విడుదల చేస్తామని సీఎం తెలిపారు