HomeTelanganaPolitics

తెలంగాణ బీజేపీకి షాక్ – మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా

తెలంగాణ బీజేపీకి షాక్ – మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా

తెలంగాణ బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల ముందు పెద్ద షాక్ తగిలింది. మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు, యువనేత విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరక

వచ్చేనెల 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
బీజేపీలో మల్కాజిగిరి రాజకీయం.. ఆ సీటుపై కన్నేసిన ఈటల… ఆయనకు రాకుండా చక్రం తిప్పుతున్న బండి
అన్ని వర్గాల ప్రజల మేలు కోసం కొట్లాడే ఫైటర్ బండి సంజయ్: బొంతల కళ్యాణ్

తెలంగాణ బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల ముందు పెద్ద షాక్ తగిలింది. మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు, యువనేత విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాశారు.

రాజీనామా లేఖలో విక్రమ్ గౌడ్, పార్టీలో కొత్త వారిని అంటరాని వారుగా చూస్తున్నారని, క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా గుర్తింపు ఇవ్వడం లేదని, ఏదో ఒక గ్రూప్ రాజకీయాలలో ఉంటేనే పార్టీలో మనుగడ అని చెప్పుకొచ్చారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోలేదని లేఖలో విక్రమ్‌గౌడ్ పేర్కొన్నారు. కాగా త్వరలోనే విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరతారని సమాచారం.