ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల ప్రచారం ముగిసిపోతుంది. దాంతో గెలవడం కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్ని
ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల ప్రచారం ముగిసిపోతుంది. దాంతో గెలవడం కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్ని తంటాలు పడాలో అంతకన్నా ఎక్కువే పడుతున్నారు. అలవి కాని హామీలు, వాగ్దానాలు ఇవ్వడమే కాక కొందరు ప్రజలను వివిధరకాల ప్రలోభాలాకు గురి చేస్తున్నారు. ఓ బీఆరెస్ అభ్యర్థి అయితే ఏకంగా ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు.
బీఆరెస్ హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి గెలవడం కోసం అష్టకష్టాలుపడుతున్నాడు. ప్రస్తుత ఎమ్మెల్యే, బలమైన బీజేపీ అభ్యర్థి ఈటల రాంజేంధర్ ను కౌశిక్ ఎదుర్కొంటున్నాడు. ఈటల పై గెలవడం కష్టమైన పరిస్థితుల్లో ఆయన ఎన్నిపనులు చేయాలో అన్ని చేస్తున్నాడు. చివరకు ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనకాడటం లేదు.
ఆయన ఈ రోజు ఓ ప్రచార సభలో మాట్లాడుతూ, ”మీరు నాకు ఓటేసి దీవిస్తే నాలుగో తారీఖున జైత్రయాత్ర లేదంటే మా కుటుంబ సభ్యుల శవయాత్రే. కుటుంబ సభ్యులం ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటాం” అని కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
కౌశిక్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఓడిపోతున్నాడనడానికి ఉదహరణ అని ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తుండగా, ప్రజలు కూడా వివిధ రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఓటెయ్యకపోతే ఆత్మహత్యచేసుకుంటామనడం ఏం రాజకీయమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రత్యర్థులు ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేయాలని యోచిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బహిరంగంగా బెధిరించడం నేరమని అతనిపై కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు.