HomeTelanganaPolitics

అందరి దగ్గర డబ్బులు తీసుకోండి, మీకు నచ్చిన వాళ్ళకు ఓటేయండి… ఆర్జీవీ

అందరి దగ్గర డబ్బులు తీసుకోండి, మీకు నచ్చిన వాళ్ళకు ఓటేయండి… ఆర్జీవీ

ఎన్నికల్లో డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోవడంలో అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. తెలంగాణలో ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ ఐదు వేల రూపాయలకు పైనే డబ్బులను పంచుతోం

మూడవ జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, రెండు చోట్ల నుంచి రేవంత్ పోటీ
బీఆరెస్ కు ఓటమి భయం పట్టుకుందా ? రంగంలోకి పీకేను దించిన కేసీఆర్ ?
మనం ఓడిపోతున్నామని మనమే ప్రచారం చేస్తే ఎట్లా ? నాయకులకు కేటీఆర్ క్లాస్…ఆడియో లీక్

ఎన్నికల్లో డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోవడంలో అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. తెలంగాణలో ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ ఐదు వేల రూపాయలకు పైనే డబ్బులను పంచుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి 15 వేల కోట్లకు పైగా డబ్బులు ఖర్చుపెట్టినట్టు అంచనా.

ఈ నేపథ్యంలో ఓటు అమ్ముకోవద్దని, డబ్బులు తీసుకోవద్దని పలువురు మేదావులు ఓటర్లకు పిలిపునిస్తున్నారు. డబ్బులకు ఓట్లను అమ్ముకుంటే మన భవిష్యత్తును అమ్ముకున్నట్టే అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎప్పుడూ అందరికి భిన్నంగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సినీ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓటుకు నోటు తీసుకోవాలని ప్రజలకు చెప్తున్నాడు.

”ఓట్ల కోసం నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవద్దని నేను ఓటర్లకు చెప్పను. అయితే నోట్లు ఇచ్చిన నేతపై కృతజ్ఞత చూపాల్సిన అవసరం లేదు. డబ్బులు తీసుకున్నాననే కృతజ్ఞత చూపాలనుకోవడం మీకు మీరు చేసుకుంటున్న ద్రోహం.ఓటును కొనుక్కోవాలని చూడడం సదరు నేత చేసిన నేరం. నేరస్థుడిపై జాలి కానీ, కృతజ్ఞత కానీ చూపాల్సిన అవసరం లేదు.”అని ఆర్జీవీ హితవు పలికారు.

బుధవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ చిత్రకారుడు రమణరెడ్డి ఏర్పాటు చేసిన ఆర్ట్‌ ఫర్‌ డెమోక్రసీ కార్టూన్‌ చిత్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓటును అమ్ముకోవద్దని, నోట్లు తీసుకోవద్దని తాను చెప్పబోనని వ్యాఖ్యానించారు. మనకు అవసరం లేదు కాబట్టి మనం తీసుకోవట్లేదు, అవసరం ఉన్న వారు తీసుకుంటారు.. అందులో తప్పేం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు తీసుకున్నా సరే మీకు మంచి చేసే వ్యక్తికి ఓటేయండని రాంగోపాల్ వర్మ సూచించారు.