HomeTelanganaPolitics

ఎన్నికలకు కొద్ది ముందు కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్న కేసీఆర్

ఎన్నికలకు కొద్ది ముందు కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్న కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హోరు మొదలైనప్పటి నుంచి, ముఖ్యంగా బీఆరెస్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జోరుగా సాగ

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారైనట్టేనా ?
మోడీతో ప్రైవేటు మీటింగ్ లో మాట్లాడిన సంచలన విషయాలు బైటపెట్టిన కేసీఆర్
బీఆరెస్ కన్నా ముందంజలో కాంగ్రెస్…. ‘సౌత్ ఫస్ట్ న్యూస్’ ప్రీ పోల్ సర్వే వెల్లడి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హోరు మొదలైనప్పటి నుంచి, ముఖ్యంగా బీఆరెస్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జోరుగా సాగాయి. బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ లోకి చేరికలు పెరిగాయి. ఒకవైపు కర్నాటక ఎన్నికల్లో గెలుపు, మరో వైపు తెలంగాణ కాంగ్రెస్ లో పెరుగుతున్న ముఖ్యనేతల చేరికలతో కాంగ్రెస్ ఊహించినదానికన్నా పుంజుకుంది. అంతకు ముందు బీఆరెస్ తో ఢీకొంటుందనుకున్న బీజేపీని దాటి చాలా ముందుకు పోయింది కాంగ్రెస్. మెజార్టీ నియోజకవర్గాల్లో బీఆరెస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి.

ఖమ్మం లాంటి జిల్లాల్లో బీఆరెస్ కు ఒక్క సీటు కూడా రాదని, కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బీఆరెస్ గెలుస్తుందా లేక కాంగ్రెస్ గెలుస్తుందా అనేది తేల్చలేని పరిస్థి నెలకొంది. 5నెలల క్రితం వరకు లేని ఈ పరిస్థితి ఈ రోజు నెలకొంది.

ఈ పరిస్థిని దెబ్బకొట్టి మళ్ళీ పై చేయి సాధించాలని కేసీఆర్ నడుం భిగించినట్టు తెలుస్తోంది. తన ప్రచార కార్యక్రమాలకు మూడు రోజులు బ్రేక్ ఇచ్చి అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి ముఖ్యనేతలను బీఆరెస్ లోకి చేర్చుకునే పనిలో బిజీ అయిపోయారు. ముందుగా ఆయన, కాంగ్రెస్ కు చాలా బలమైన జిల్లా అని ప్రచారం ఉన్న ఖమ్మం జిల్లాపై దృష్టి కేంధ్రీకరించారు.

కాంగ్రెస్ పార్టీ టికట్ దక్కని నాయకులపై వల వేశారు కేసీఆర్. కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన‌ మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, పీసీసీ అధ్యక్షుడి అత్యంత సన్నిహితుడు, విద్యార్థినేతగా పేరున్న మానవతారాయ్, టీపీసీసి ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ రాజకీయ నేత వూకె అబ్బయ్య దంపతులు, డా. రామచంద్రు నాయక్ తో పాటు పలువురు సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లో అసంత్రుప్తిగా ఉన్న‌ ముఖ్యనేతలతో కేసీఆర్ స్వయంగా మాట్లాడుతున్నట్టు సమాచారం. ఈ రెండు మూడు రోజుల్లో ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు కారు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. స్థానిక నాయకులతో సంబంధం లేకుండా స్వయంగా కేసీఆరే మాట్లాడుతుండటంతో కాంగ్రెస్ నాయకులు కారెక్కడానికి రెడీ అవుతున్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉండి టికట్ రాక పోగా, నిన్న మొన్న పార్టీలో చేరినవారికి టికట్ రావడంతో రగిలిపోతున్న పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు కేసీఆర్ పిలుపుతో కారెక్కబోతున్నారని సమాచారం.
కాంగ్రెస్ నుండి బీఆరెస్ లో చేరినవారందరికీ స్వయంగా కేసీఆరే తమ ప్రభుత్వం రాగానే ముఖ్యమైన పదవులు ఇస్తాన‌నే హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ఈ పరిస్థితులను రేవంత్ రెడ్డి కానీ, ఇతర కాంగ్రెస్ అగ్రనేతలు కానీ ఎలా ఎదుర్కొంటారు ? తమ నాయకులు జంప్ కాకుండా ఎలా కాపాడుకుంటారు? అనేది పెద్ద ప్రశ్నే.