HomeTelanganaPolitics

మూడవ జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, రెండు చోట్ల నుంచి రేవంత్ పోటీ

మూడవ జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, రెండు చోట్ల నుంచి రేవంత్ పోటీ

తెలంగాణ అసెంబ్లీలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల మూడవ జాబితా ఆ పార్టీ విడుదల చేసింది. 16 మంది అభ్యర్థులతో విడుదల చేసిన ఈ జాబితాలో కామారెడ్డి అభ్యర్థి

కాంగ్రెస్ తో సీపీఎం క‌టీఫ్… ఒంటరిగా పోటీకి నిర్ణయం
తెలంగాణ లో హంగ్ వస్తే ఏం జరుగుతుంది ? ఎవరు అధికారంలోకి వస్తారు ?
మనం ఓడిపోతున్నామని మనమే ప్రచారం చేస్తే ఎట్లా ? నాయకులకు కేటీఆర్ క్లాస్…ఆడియో లీక్

తెలంగాణ అసెంబ్లీలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల మూడవ జాబితా ఆ పార్టీ విడుదల చేసింది. 16 మంది అభ్యర్థులతో విడుదల చేసిన ఈ జాబితాలో కామారెడ్డి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించారు. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోటీపడనున్నారు. ఇప్పటికే రేవంత్ ను కొడంగల్ అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో రేవంత్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. కామారెడ్డి నుండి ప్రతీ సారి పోటీ చేసే షబ్బీర్ అలీకి ఈ సారి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కేటాయించారు.

కాగా వనపర్తి, బోథ్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ మార్చింది. వనపర్తి నుండి ముందు చిన్నారెడ్డి పేరు ప్రకటించగా ఇప్పుడు ఆయనను మార్చి మేఘారెడ్డి పేరు ప్రకటించారు. ఇక బోథ్ లో ముందుగా వన్నెల అశోక్ ను ప్రకటించిగా ఇప్పుడు ఆయనను మార్చి ఆదె గజేంధర్ కు టికట్ కేటాయించారు.

ఇక మిర్యాలగూడా, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ స్థానాలను కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టింది.

ఏఐసీసీ విడుదల చేసిన 16 మంది అభ్యర్థుల పూర్తి లిస్ట్: