HomeTelanganaPolitics

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు శతృవులయ్యారా ?

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు శతృవులయ్యారా ?

ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం వైఎస్సార్ సీపీని ఎదిరించేందుకు చంద్రబాబు తో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ లు తెలంగాణలో మాత్రం రెండు శతృపక్షాలవైపు నిలబడ్డార

ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?
నన్ను గెలిపించకపోతే కుటుంబం అంతా ఆత్మహత్యచేసుకుంటాం … ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్న బీఆరెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం వైఎస్సార్ సీపీని ఎదిరించేందుకు చంద్రబాబు తో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ లు తెలంగాణలో మాత్రం రెండు శతృపక్షాలవైపు నిలబడ్డారు.

ఏపీలో బీజేపీ తో పొత్తులో ఉండి, ఎన్డీఏ లో కూడా ఉన్న జనసేన పార్టీ, బీజేపీకి సంబంధం లేకుండానే తెలుగు దేశం తో చెతులు కలిపింది. తెలగుదేశానికి బీజేపీ దూరంగా ఉన్నప్పటికీ పవన్ లెక్కచేయకుండ మరీ బాబుతో రాసుకపూసుక తిరుగుతున్నాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఎన్నకల్లో కలిసి పోటీ చేస్తాయని పవన్ ప్రకటించారు కూడా. అక్కడ ఇప్పుడు రెందు పార్టీల నాయకుల మధ్య సమన్వయ సమావేశాలు కూడా జరుగుతున్నాయి.

చందర్బాబు అరెస్టును ఖండించిన పవన్ కళ్యాణ్, జైలుకు వెళ్ళి మరీ బాబును కలిశారు. హెల్త్ బెయిల్ పై బైటికి వచ్చిన చంద్రబాబు ను ఆయన ఇంటికి వెళ్ళి కలిశారు పవన్. దాదాపు మూడు గంటలపాటు ఈ ఇద్దరూ చర్చలు జరిపారు. ఇదంతా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగింది. మరో వైపు అదే తెలంగాణ బాబు, పవన్ లు శతృపక్షాలుగా మారి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని నిరూపించారు.

తెలంగాణలో హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ పోరులో బారత రాష్ట్రసమితి, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోరాడుతున్నాయి. ఇక మొన్నటి దాకా తేమే అధైకారంలోకి వస్తున్నామని డాంభికాలు పలికిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఏం చేయాలో అర్దం కాని పరిస్థితుల్లో అయోమయంగా, కనీసం పది సీట్లైనా వస్తాయా రావా అనే అనుమానంతో కొట్టుమిట్టాడుతున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం చంద్రబాబు లోపాయకారిగా పని చేస్తున్నారు. తెలంగాణలోని ఆయన సామాజికవర్గానికి చెందిన ప్రజలు, ఆయన ఫ్యాన్స్ బహిరంగంగానే కాంగ్రెస్ ను గెలిపించడానికి రంగంలోకి దిగారు. హైదరాబాద్ తో సహా తెలంగాణలోని అనేక నియ్తోజకవర్గాల్లో బాబు సామాజిక వర్గం ఫలితాలపై ప్రభావం చూపించగలిగే స్థాయిలో ఉంది.

ఇక మరో వైపు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న పవన కళ్యాణ్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీతో కలిసి నిలబడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ , జనసేన పొత్తు పెట్టుకున్నాయి. మొత్తం 119 స్థానాల్లో జనసేనకు బీజేపీ 9 స్థానాలిచ్చింది. ఈ రెండు పార్టీల అలయన్స్ బీఆరెస్ తో కాంగ్రెస్ తో పోరు చేస్తున్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ గెలవకుండా చూడటమే బీజేపీ ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న పలు నియోజకవర్గాల్లో బీజేపీ తమ ఓట్లను బీఆరెస్ వైపు మళ్ళీంచే అవకాశం ఉందని బీజేపీ కింది స్థాయి కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. బీజేపీ ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే. అయితే తెలంగాణలో చంద్రబాబు లక్ష్యం కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సహకరించడమే.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ను అధికారంలోకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్న తన స్నేహితుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ ను అధికారంలో రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీతో పొత్తుపెట్టుకోవడం రాజకీయాల్లో సిద్దాంతాలకు ఎలాంటి చోటు లేదని తేలిపోతున్నది.

ఇప్పుడు తెలంగాణలో జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఎదురుబొదురుగా నిలబడి యుద్దం చేయనున్నారు. అయితే ఏపీలో మాత్రం వీరిద్దరూ ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని ”దోస్త్ మేరా దోస్త్…” అంటూ స్నేహగీతాలు పాడబోతున్నారు. ఈ విషయంలో బీజేపీకి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడం మరో రాజకీయ వింత‌.