HomeTelanganaUncategorized

కరీంనగర్ ఫలితాలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతున్నయ్: బండి సంజయ్

కరీంనగర్ ఫలితాలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతున్నయ్: బండి సంజయ్

కరీంనగర్ ఫలితాలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతున్నయ్ ఓట్ల కోసం పచ్చ కరీంనగర్ ఆత్మగౌరవాన్ని దారుస్సలాంకు తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ అభ్యర్ధి

తన ఇంగ్లీషు తో దడదడలాడించిన రిక్షావాలా
•మాది దోపిడీ దొరల ప్రభుత్వం కాదు… ప్రజా ప్రభుత్వం
హింస, దాడులు, మహిళల నగ్న ఊరేగింపులు, అత్యాచారాలు… మండుతున్న మణిపూర్ మోడీకి ఎందుకు పట్టదు ?

కరీంనగర్ ఫలితాలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతున్నయ్

ఓట్ల కోసం పచ్చ కరీంనగర్ ఆత్మగౌరవాన్ని దారుస్సలాంకు తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ అభ్యర్ధి

కేసీఆర్ నియంత పాలనపై పోరాడి కరీంనగర్ ఆత్మగౌరవాన్ని దేశానికి చాటిన చరిత్ర నాది

ఓట్ల కోసం జెండాలు మార్చే దుర్మార్గులను గుణపాఠం చెప్పండి

బీజేపీ అధికారంలోకి వస్తే కరీంనగర్ రూపురేఖలు మారుస్తా

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

బండి సమక్షంలో బీజేపీలో చేరిన 14, 32వ డివిజన్ నాయకులు

o కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యావత్ తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఓట్ల కోసం కరీంనగర్ ఆత్మగౌరవాన్ని దారుస్సలాంకు తాకట్టుపెట్టిన బీఆర్ఎస్ కావాలా? కేసీఆర్ దుర్మార్గపు పాలనపై పోరాడుతూ కరీంనగర్ ఆత్మగౌరవాన్ని దేశానికి చాటిచెప్పిన బీజేపీ అభ్యర్ధి కావాలా? ఆలోచించి ఓటేయాలని కోరారు. ప్రజల బతుకులు మారాలని, పేదల రాజ్యం రావాలని కంటిమీద కునుకు లేకుండా పోరాటం చేస్తున్న మీ బిడ్డకు అండగా ఉండాలని కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, కరీంనగర్ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.

o ఈరోజు మధ్యాహ్నం సప్తగిరి కాలనీలోని మాచర్ల ఫంక్షన్ హాలులో జరిగిన బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నియోకజవర్గ సౌత్, సెంట్రల్ జోన్ నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

o కరీంనగర్ ప్రజల ఆత్మగౌరవం ప్రమాదంలో పడింది. ఓట్ల కోసం బీఆర్ఎస్ జెండాను వీడి పచ్చ జెండా ఎత్తుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దారుస్సలాంపోయి కరీంనగర్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఒవైసీకి తాకట్టు పెట్టిండు. పొరపాటున మళ్లీ ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఎంఐఎం జెండాను ఎగరేసే ప్రమాదం ఉందన్నారు. అదే జరిగితే కరీంనగర్ ప్రజలు బొట్టుపెట్టుకుని, కంకణం కట్టుకుని తిరిగే అవకాశం కూడా ఉండదని హెచ్చరించారు.

o నేను ఓడినా, గెలిచినా కాషాయ జెండాను వదల్లేదు. మీరిచ్చిన ధైర్యం, అండతో కాషాయ జెండాను ముద్దాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం, పేదల కోసం పోరాడుతున్న. కరీంనగర్ ఆత్మగౌరవ పతాకాన్ని దేశమంతా ఎగరేసిన. మీరు ఎక్కడికి వెళ్లినా కరీంనగర్ వాసులమని కాలరెగరేసి చెప్పుకునేలా చేసిన.

o నేను పోటీ చేస్తున్నట్లు తెలియగానే బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్ల కోసం దారుస్సలాం పోయి ఒవైసీ కాళ్లు పెట్టి కరీంనగర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. గతంలో టీడీపీ నుండి గెలిచి బీఆర్ఎస్ లోకి పోయిండు. ఆ తరువాత బీఆర్ఎస్ నుండి గెలవగానే పచ్చ జెండాతో ర్యాలీ తీసిండు. ఇప్పుడేమో ఓట్ల కోసం దారుస్సలాం పోయి ఒవైసీకి సలాం చేస్తుండు.

o తెలంగాణలో ఎంఐఎంను లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న. కరీంనగర్ ఆత్మగౌరవాన్ని ఒవైసీకి తాకట్టుపెట్టిన నేతలకు బుద్ది చెప్పాలని కోరుతున్నా. అట్లాగే బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.

o అంతకుముందు నగరంలోని 11, 32, డివిజన్లకు చెందిన వేణు, విజయ్, సాయి చరణ్, రామ్మోహన్, రాకేశ్, రాజేశ్, ఫయాజ్, మల్లేశం, నర్సయ్య, రమేశ్, మందసాయి చరణ్, సాయి, చింటూ, సన్నీ చరణ్ సహా భారీ ఎత్తున యువకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ బండి సంజయ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

మోదీ సభకు భారీగా తరలిరండి

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నేతలతో బండి సంజయ్ భేటీ

అంతకుముందు బండి సంజయ్ నగరంలోని శుభమంగళ్ గార్డెన్స్ లో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈనెల 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే బీసీల ఆత్మగౌరవ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్న నేపథ్యంలో జన సమీకరణ, సభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ మూడు జిల్లాల నుండి భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని, ముఖ్యంగా బీసీలు భారీ సంఖ్యలో వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.