HomeTelanganaUncategorized

దేశ చరిత్రలో ఎక్కడ లేనివిధంగా దివ్యాంగులకు పింఛన్లు: మంత్రి గంగుల

దేశ చరిత్రలో ఎక్కడ లేనివిధంగా దివ్యాంగులకు పింఛన్లు: మంత్రి గంగుల

దేశ చరిత్రలో ఇక్కడ లేనివిధంగా దివ్యాంగులకు పింఛన్లు బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే 6016 పెన్షన్ పెంపు గంగులకు ఓటేస్తే కెసిఆర్ కు ఓటేసినట్టే

రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం… స్పష్టం చేసిన కాంగ్రెస్ ఇంచార్జ్
దుబాయ్ పర్యటన‌లో రేవంత్, శ్రీధ‌ర్ బాబు
లోక్‌సభ ఎన్నికల పోటీలో BRSలో ఈ సారి కొత్త ముఖాలు?

దేశ చరిత్రలో ఇక్కడ లేనివిధంగా దివ్యాంగులకు పింఛన్లు

బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే 6016 పెన్షన్ పెంపు

గంగులకు ఓటేస్తే కెసిఆర్ కు ఓటేసినట్టే

దివ్యంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల

.
పేద ప్రజలు సంతోషంగా ఉండాలని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా పింఛన్లు అమలు చేస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణా నని కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

నేడు ఆదివారం పద్మనాయక కళ్యాణమండపంలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలసి మంత్రి గంగుల కమలాకర్ హాజరై మాట్లాడారు

ఈ సందర్బంగా మంత్రిగంగుల మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం అనంతరం ప్రజల మనస్సు నిండ, కడుపునిండా వచ్చే నవ్వులే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దీవెనలని అన్నారు. అన్ని అవయవాలు పనిచేసిన వక్రబుద్దితో ఉన్నవారే అసలైన దివ్యాంగులని, ఎటువంటి కల్మషం లేకపోయిన విదివశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారు దైవసమానులని, వారు సమాజంలో చులకన భావానికి గురికాకుండ, సగౌరవంతో బ్రతకాలని వికలాంగులను అక్కున చేర్చుకుని 4016 వికలాంగుల పింఛన్ అందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వికలాంగులకు 6016పింఛను అందజేస్తుందని వెల్లడించారు..కరీంనగర్ అసెంబ్లి నియోజక వర్గంలో 6433 మంది వికలాంగులకు పెన్షన్ 4016 చొప్పున అందజేస్తున్నామని వెల్లడించారు..

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంపద పెరిగిందని పెరిగిన సంపదను పేదలకు పంచాలని లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు పరుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ బిజెపి అధికారంలోకి వస్తే పథకాలను ఎత్తేస్తారని.. కాంగ్రెస్ బిజెపి ఢిల్లీ పార్టీలు… బిఆర్ఎస్ మన ఇంటి పార్టీఅన్నారు. దొంగలకు సద్ది మొయ్యొద్దని . ఢిల్లీ ఆంద్రోళ్ళ చేతుల్లో తెలంగాణను పెట్టొద్దని విజ్ఞప్తి చేసారు.. ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి… కేసీఆర్ గెలిపించుకోవాలని అన్నారు…. బిజెపి అధికారంలోకి వచ్చేది లేదు పోయేది లేదని మతాలు కులాల పేరిట బిజెపి విభజన చేస్తే… కర్ణాటక లో అమలు కాని హామీలను గుప్పిస్తూ… కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని అన్నారు.. గంగులకు ఓటు వేస్తే సీఎం కేసీఆర్ కు వేసినట్టేనని అన్నారు.. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు.. గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ తదితరులు ఉన్నారు