తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టినరోజు సందర్భంగా తొందరగా పూలబొకే తేలేదని కోపంతో తన గన్ మ్యేన్ చెంపపగలగొట్టిన హోం మంత్రి మహమూద్ అలీ తన చర్యను సమర్దించుకున
తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టినరోజు సందర్భంగా తొందరగా పూలబొకే తేలేదని కోపంతో తన గన్ మ్యేన్ చెంపపగలగొట్టిన హోం మంత్రి మహమూద్ అలీ తన చర్యను సమర్దించుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి మాట్లాడుతూ, తాను తన గన్ మ్యాన్ ను కొట్టిన సంఘటనపై అనవసరం రచ్చ చేస్తున్నారని అన్నారు. ఆ గన్ మ్యాన్ తన కొడుకులాంటి వాడని, కొడుకును మాత్రం కొట్టమా అని ప్రశ్నించారు.
గన్ మ్యాన్ ను ప్రేమతోనే కొట్టానని, కోపంతో కాదని తండ్రి కొడుకుల మధ్య ఆ మాత్రం ప్రేమ ఉండదా అని మహమూద్ అలీ అన్నారు. ఆయన పక్కనే ఉన్న తన అనుచరుడి చెంపపై చిన్నగా కొట్టి, మనం ప్రేమించేవారిని ఇలా చెంపపై చిన్నగా కొడితే తప్పేంటన్నారు.
మొత్తానికి తాను గన్ మ్యాన్ చెంప పగులకొట్టడం లో ఎలాంటి తప్పూ లేదని తేల్చిపడేశారు హోం మంత్రి మహమూద్ అలీ.