HomePoliticsAndhra Pradesh

చంద్రబాబును కుట్టిన దోమలు గుండెపోటుతో చనిపోతున్నాయట‌

చంద్రబాబును కుట్టిన దోమలు గుండెపోటుతో చనిపోతున్నాయట‌

'Mosquitoes that bit Chandrababu are dying of heart attack'

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు శతృవులయ్యారా ?
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ ల యుద్దం

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత వైసీపీ , టీదీపీ నాయకుల మధ్య మాటల యుద్దం పతాక స్థాయికి చేరింది. రాజమండ్రి జైలులో ఉన్న బాబును దోమలు కుడుతున్నాయని, దోమలద్వారా వైసీపీ నాయకులు చంద్రబాబుకు స్లోపాయిజన్ ఇస్తున్నారని ఓ టీడీపి నాయకుడు వింతైన వాదన కూడా చేశారుడు.

ఇప్పుడు ఆ దోమల మీద వైసీపీ నాయకుడు , ఎంపీ విజయసాయి రెడ్డి సెటైరికల్ గా స్పంధించారు. ఆయన ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబును కుట్టిన దోమలు వెంటనే గుండె పోటుతో చనిపోతున్నాయని, ఇప్పుడు దోమలు అంతర్జాతీయ న్యాయస్థానంలో పీటీ వారంట్ వేసినా, వారు వైసీపీకే అంటగడతారని ఎద్దేవా చేశారు.

”క్రిమికీటకాల నిజనిర్దారణ కమిటీ పరిశీలన…చంద్రబాబు గారిని కుట్టిన వెంటనే దోమలు గుండె(వెన్ను)పోటుకుగురై చనిపోతున్నాయట! దీనిపై దోమల సంక్షేమ కమిటీ తీవ్రంగా స్పందించి చంద్రబాబుగారిపై అంతర్జాతీయ క్రిమికీటకాల న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాయట! ఇప్పుడు ఆ కేసులో కూడా పీటీ వారెంట్ వస్తే దానికి కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ఉన్నారు మన ఫ్రస్ట్రేటెడ్ తెలుగు తమ్ముళ్లు.” అని ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.

దీనిపై ట్విట్టర్ లో నెటిజనులు భిన్నంగ్ఫా స్పందిస్తున్నారు. కొందరు విజయసాయిరెడ్డిపై దుమ్మెత్తి పోస్తూ ఉంటే మరికొందరు ఆయన వాదనలకు మద్దతు పలుకుతున్నారు.