BRS సీనియర్ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను బీఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నట్లు ఎమ్మెల్యే ఓ వీడియోను వి
BRS సీనియర్ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను బీఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నట్లు ఎమ్మెల్యే ఓ వీడియోను విడుదల చేశారు. సంక్షోభ సమయంలో మద్దతునిచ్చినందుకు తన శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏ రాజకీయ పార్టీలో చేరుతాననే విషయం త్వరలోనే చెప్తానని అప్పటి వరకు తన మద్దతుదారులు సంయమనం పాటించాలని అభ్యర్థించారు.
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తన కుమారుడు ఎం.రోహిత్‌కు పార్టీ టికెట్ ఇవ్వనందుకు బీఆర్‌ఎస్ నాయకత్వంపై హనుమంతరావు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తన కుమారుడికి పార్టీ టికెట్ కేటాయించాలని బీఆర్‌ఎస్ నేత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావుకు తాను చేసిన విజ్ఞప్తిని కూడా ఆయనపట్టించుకోలేదని విమర్శించారు.
మల్కాజి గిరి నుంచి హనుమంతరావును తమ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఆయన రాజీనామా చేయడం విశేషం. కాగా ఆయన త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం.