HomeNationalCrime

ట్యూషన్ టీచర్ ను పొడిచి చంపిన బాలుడు

ట్యూషన్ టీచర్ ను పొడిచి చంపిన బాలుడు

ఆగస్టు 30న మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో జామియా నగర్‌లోని బాట్లా హౌస్‌లోని ఓ ఇంటి రెండో అంతస్తులోని ఓ గదిలో నుంచి రక్తం వస్తోందని, గది తెరిచి ఉందని ఢ

మేక దొంగతనం నెపంతో దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేసిన నిందితుల అరెస్ట్
అరెస్టు భయంతో పర్యటన రద్దు చేసుకున్న పుతిన్
రైల్లో కానిస్టేబుల్ కాల్పులు – ASI సహా నలుగురు మృతి

ఆగస్టు 30న మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో జామియా నగర్‌లోని బాట్లా హౌస్‌లోని ఓ ఇంటి రెండో అంతస్తులోని ఓ గదిలో నుంచి రక్తం వస్తోందని, గది తెరిచి ఉందని ఢిల్లీలోని జామియా నగర్ పోలీసులకు కాల్‌ వచ్చింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆ ఇంట్లో రక్తంతో నిండిన ఓ యువకుడి మృతదేహం కనిపించింది. ఆ యువకుడి మెడపై లోతైన కత్తి గాయం ఉంది.

వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడిని 28 ఏళ్ల ప్రైవేట్ ట్యూటర్‌ వసీంగా గుర్తించారు. అనంతరం మరింత లోతుగా దర్యాప్తు చేసి ఓ 14 ఏళ్ళ బాలుడే ఈ హత్య చేశాడని నిర్దారణకు వచ్చిన పోలీసులు మూడు రోజులు గాలించి శుక్రవారం నాడు ఆ బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బైటపడ్డాయి. ఆ 14 ఏళ్ళ బాలుడికి వసీం ట్యూషన్ చెప్పేవాడు. స్వలింగ సంపర్కుడైన వసీం ఆ బాలుడిపై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీడియోలు తీసి, తనకు సహకరించకపోయినా, బైటికి చెప్పినా ఈ వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. చాలా కాలంగా వసీం అకృత్యాలను భరిస్తూ వచ్చిన ఆ బాలుడు అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

సంఘటన జరిగిన రోజున, వసీం తన కుటుంబానికి చెందిన‌ జామియా నగర్ ఇంట్లో తనను కలవాలని బాలుడికి కాల్ చేశాడు. ఇక ఆరోజు వసీం ను ఎలాగైనా చంపాలని డిసైడ్ అయిన బాలుడు పదునైన పేపర్ కట్టర్ తీసుకొని వసీం చెప్పిన ఇంటికి వెళ్ళాడు. బాలుడిపై వసీం లైంగికదాడికి దిగగానే ఆ బాలుడు పేపర్ కట్టర్ తో వసీం గొంతు కోసేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.