HomeTelangana

గద్దర్ వెళ్ళిపోయారు…ఆయన పాట మారుమోగుతూనే ఉంది

గద్దర్ వెళ్ళిపోయారు…ఆయన పాట మారుమోగుతూనే ఉంది

నిన్న అనారోగ్యంతో మరణించిన ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో బౌద్ధ ఆచారాల ప్రకారం ఆయన స్థాపించిన మహా బోధి విద్యాలయ మై

పేదల కోసం గర్జించిన పాట వెళ్ళిపోతోంది… ప్రారంభమైన గద్దర్ అంతిమ యాత్ర
బాలుడి ప్రాణాలు తీసిన తల్లితండ్రుల మూఢనమ్మకం… గంగలో ముంచి చంపేశారు
గద్దర్ మృతికి ప్రముఖుల సంతాపం

నిన్న అనారోగ్యంతో మరణించిన ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో బౌద్ధ ఆచారాల ప్రకారం ఆయన స్థాపించిన మహా బోధి విద్యాలయ మైదానంలో అంత్య క్రియలుజరిగాయి.

ఆయన భౌతికకాయాన్ని ఎల్‌బీ నగర్‌ స్టేడియం నుంచి స్కూల్‌ గ్రౌండ్‌ వరకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వేలాది మంది అభిమానులు, మద్దతుదారులు, అనుచరులు, మిత్రులు వాహనం వెంట వచ్చారు. జనం రద్దీ కారణంగా అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి చాలా మంది చేరుకోలేక పోవడంతో ఉద్వేగానికి లోనయ్యారు. గద్దర్‌కు వీడ్కోలు పలికేందుకు అల్వాల్‌కు వెళ్లే దారి పొడవునా ప్రజలు గుమిగూడారు.

మహా బోధి విద్యాలయ మైదానంలో తొక్కిసలాట జరగడంతో, గద్దర్ ను చివరిసారి చూసేందుకు తరలివచ్చిన జనసమూహంపై పోలీసులు స్వల్ప లాఠీచార్జికి దిగారు. ‘గద్దర్ అమర్ రహే’ అనే నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది.

కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ అల్వాల్ లోని గద్దర్ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. గద్దర్ కుటుంబాన్ని కూడా ఓదార్చారు. మంత్రులు టీ హరీశ్‌రావు, టీ శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రితో కలిసి నివాళులర్పించారు.

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, ఎ ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎస్ నిరంజన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, మధు యాష్కీ,రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రసమయి బాలకిషన్, సి క్రాంతి కిరణ్, మైనంపల్లి హన్మంత్ రావు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న తదితరులు గద్దర్‌కు నివాళులర్పించారు.

కాగా, గద్దర్ అంత్యక్రియల సందర్భంగా ఓ విషాదం చోటు చేసుకుంది. గద్దర్ ను కడసారి చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ స‍ందర్భంగా కిందపడ్డ సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గుండె పోటు తో మరణించారు.